తెలుగులో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించిన మిర్చి చిత్రంలో పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి సంపత్ రాజ్ గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.కొంతమేర లేటుగా సంపత్ రాజ్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తొందరగా ప్రేక్షకులని ఆకట్టుకోవడంతో తెలుగులోనే కాక కన్నడం, మలయాళం, హిందీ తదితర భాషలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రల్లో నటిస్తూ బాగానే రాణిస్తున్నాడు.
ఇక సంపత్ రాజ్ వైవాహిక జీవితాన్ని విషయానికొస్తే ఇతడు 22 సంవత్సరాల వయసులోనే పలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో బాగానే మెప్పించిన సీనియర్ నటి శరణ్య ని పెళ్లి చేసుకున్నాడు. అయితే వీరిద్దరికీ ఒక పాప కూడా ఉంది.
కాగా పెళ్లి అయిన కొన్ని సంవత్సరాలకి ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో సంపత్ రాజ్ కి విడాకులు ఇచ్చి ప్రస్తుతం వేరుగా ఉంటున్నారు. ఇకపోతే తన కూతురు బాధ్యతను తానే తీసుకుని ఆమె ఆలనాపాలనా చూసుకుంటున్నాడు.
అలాగే గతంలో యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో తన భార్యతో విడాకుల గురించి మాట్లాడుతూ తమ ఇద్దరి అంగీకారం మేరకే విడాకులు తీసుకున్నట్లు తెలిపాడు.అంతేగాక తన కూతురు కూడా అప్పుడప్పుడు తన తల్లిని కలిసేందుకు వెళుతుంటుందని కానీ తాను మాత్రం శరణ్య యోగక్షేమాలు ఫోన్ చేసి తెలుసుకుంటానని తెలిపాడు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సంపత్ రాజ్ తెలుగులో ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న రెడ్ అనే చిత్రంలో ప్రధాన ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నాడు.అలాగే డీకే బోస్ అనే చిత్రంలో కూడా నటిస్తున్నాడు.
కాగా ఇప్పటివరకు సంపత్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, తదితర భాషలలో కలిపి దాదాపు 50కి పైగా చిత్రాలలో విలన్ పాత్రలలో నటించాడు.