తెలంగాణలో నిన్న మొన్నటి వరకు ఏ ఎన్నికలు జరిగినా కూడా వార్ వన్‌సైడ్ అయిపోతూ వస్తోంది.కారు జోరుకు ఏ ఎన్నికల్లోనూ ఏ పార్టీ కూడా బ్రేకులు వేసే పరిస్థితి లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతోన్న ఓ ఎమ్మెల్సీ ఎన్నిక తెలంగాణ రాజకీయ వర్గాల్లో కాస్త ఆసక్తికరంగా మారింది.ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధికార టీఆర్ఎస్ సైతం వెనుకడుగు వేస్తుండడం ఓ ట్విస్ట్ అయితే.
ఇద్దరు ఉద్దండులు అయిన మేథావులు పోటీ పడడం మరో ఎత్తు. టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కొదండ రాం తెలంగాణ ఏర్పాటు కోసం ఎంతో కష్టపడ్డారు.
ఆ తర్వాత కేసీఆర్‌తో ఆయనకు తేడా రావడంతో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన తెలంగాణ జనసమితి పార్టీ పెట్టి కాంగ్రెస్‌తో కలసి ఎన్నికల్లో పోటీ చేశారు.
ఆ ఎన్నికల్లో కోదండరాం జనగామ నుంచి పోటీ చేస్తారనుకున్నా చేయలేదు.
ఆ తర్వాత మళ్లీ కోదండ రాం పొలిటికల్‌గా యాక్టివ్ అయ్యేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.చట్టసభల్లోకి ఎంట్రీ ఇవ్వాలని కోదండరాం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా ఆయనకు సరైన ఛాన్స్ ఎప్పుడూ రాలేదు.
తాజాగా జరుగుతోన్న ఓ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన తన అదృష్టం పరీక్షించుకోవాలని నిర్ణయం తీసుకున్నారట. కరీంనగర్-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి జరిగే ఎన్నికల్లో ఆయన బరిలో ఉండడం దాదాపు ఖరారే అంటున్నారు.
ఆయనకు బీజేపీతో పాటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.ఈ సీటు నుంచి పోటీ చేసేందుకు టీఆర్ఎస్ వెనకా ముందు ఆలోచిస్తోందట.
అటు కోదండ రాం పైగా గ్రాడ్యుయేట్లలో ఆయన పట్ల సానుభూతి ఉంది. ఖమ్మం లాంటి చోట్ల మెజార్టీ ఓటింగ్ ఆయనకే పడుతుందన్న లెక్కలు కూడా టీఆర్ఎస్ వేసుకుందట.
ఈ టైంలో కోదండరాం పై తమ పార్టీ నుంచి అభ్యర్థిని పోటీ పెట్టి ఓడిపోతే అది ఖచ్చితంగా గులాబీ పార్టీకి మైనస్ అవుతుంది.అందుకనే ఈ ఎన్నికలకు టీఆర్ఎస్ దూరం కాబోతుందంటున్నారు.
మాజీ ఎమ్మెల్సీ, మరో ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ గతంలో ఎమ్మెల్సీగా గెలిచారు.ఇప్పుడు ఆయన ఇక్కడ ఆయన్ను పోటీ చేయించి మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ భావిస్తోందట.అయితే నాగేశ్వర్ ఇక్కడ పోటీ చేస్తారా ? లేదా ? అన్నది చెప్పలేం. నాగేశ్వర్‌కు హైదరాబాద్ రంగా రెడ్డి మరియు మహబుబ్ నగర్ గ్రాడ్యుయేట్ల నియోజకవర్గం కూడా ఆప్షన్‌గా ఉంది.ఒకవేళ నాగేశ్వర్ వర్సెస్ కోదండ రాం ఇక్కడ పోటీ చేస్తే పోటీ మామూలు రసవత్తరంగా ఉండదు.