బి‌జే‌పి విషయంలో రాజగోపాల్ రెడ్డి యూ టర్న్

తెలంగాణ రాష్ట్రంలో  ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయోమయంలో ఉంది.పార్టీ సీనియర్, జూనియర్ నాయకులు అంత టీపీసీసీ చీఫ్ పదవి ఎవరికి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

 Rajagopal Reddy Take The U Turn Join In Bjp,telengana Congress,telengana Bjp,tel-TeluguStop.com

తమకే అర్హత ఉందంటే తమకే అర్హత ఉందని ఒక్కరికొక్కరు వాదించుకుంటున్నారు.ఈ నేపథ్యంలో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కొత్త సంవత్సరం నాడు బి‌జే‌పి లోకి వెళ్ళే ఆలోచనలో ఉన్నట్లుగా తిరుపతి వేధికగా ప్రకటించాడు.

బి‌జే‌పి తెలంగాణలో టి‌ఆర్‌ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశం ఉంది కావున ఆ పార్టీలోకి వెళ్ళితే భవిష్యత్తు ఉంటుందనే ఆలోచనలో రాజగోపాల్ రెడ్డి ఉన్నట్లుగా తెలుస్తుంది.

రాజగోపాల్ నిర్ణయంతో తెలంగాణ బి‌జే‌పి నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.

కానీ ఇప్పుడు ఆయన పార్టీ మారే విషయంలో యూ టర్న్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది.ఇప్పుడు కానీ బి‌జే‌పి లోకి వెళ్ళితే కాంగ్రెస్ అధిష్టానం తనపై అనర్హత వేటు వేసే అవకాశం ఉంది.

ఉప ఎన్నికలు వస్తాయి.బి‌జే‌పి నుండి నిలబడి పోటీ చేసి గెలిస్తే లాభమే కానీ ఓడిపోతే మాత్రం మరో ముడెండ్లు ఖాళీగా ఉండాల్సి వస్తుంది అందుకే ఉప ఎన్నిక తెచ్చే సాహసం చెయ్యను అంటున్నాడు.

ఎన్నికలకు ఓ ఆరునెలల ముందు పరిస్థితి ఎలాగా ఉంటుందో ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకుంటానని చెబుతున్నాడు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube