జీరో అవర్ లో పలు అంశాలపై చర్చించాలని నోటీసు : డీఎంకే ఎంపీ

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి.పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారిగా ఉభయ సభలు సమావేశం కానున్నాయని అందరికీ తెలిసిందే.

 Dmk Mp To Discuss Various Ssues Dmk Mp,notice, Discuss, Various Issues, Zero Hou-TeluguStop.com

ఉదయం 11 గంటలకు రాజ్యసభ సమావేశాలు, మధ్యాహ్నం 2 గంటల నుంచి లోక్ సభ సమావేశాలు జరగనున్నాయి.అయితే రెండో రోజు (ఈ రోజు) జరిగే రాజ్యసభ సమావేశాల్లో జీరో అవర్ లో పలు అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అధ్యక్షతన ఈ పలు అంశాలపై చర్చించనున్నారు.

జీరో అవర్ లో పలు అంశాలపై చర్చించాలంటూ విపక్ష పార్టీ నాయకులు ఇప్పటికే రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకి నోటీసులు అందజేశారు.

డీఎంకే ఎంపీ శాంతుసేన్ నీట్ పరీక్షల నిర్వహణలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఈ విషయంపై చర్చించాలని ఆయన నోటీసు ఇచ్చారు.మరాఠా సామాజిక వర్గానికి రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సాతావ్, కరోనా వ్యాప్తిపై టీఎంసీ ఎంపీ శాంతుసేన్ నోటీసులు జారీ చేశారు.

దీంతోపాటుగా పలు బిల్లును కూడా ప్రవేశ పెట్టనున్నట్లు సమాచారం.నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ బిల్లు, దివాలా కోడ్ బిల్లు, ఆయుర్వేద బిల్లులో ఇనిస్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్జ్ బిల్లు, ఎయిర్ క్రాఫ్ట్ బిల్లలను రాజ్యసభలో ప్రవేశ పెట్టనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube