చాలామందికి వీకెండ్స్ వస్తే ఎక్కడో చోటికి వెళ్లాలని, అక్కడ తెగ ఎంజాయ్ చేయాలని సరదా పడుతుంటారు.అందుకు గాను ప్రపంచవ్యాప్తంగా మనకు ఎన్నో రకాల ఐలాండ్స్ అందుబాటులో ఉన్నాయి.
ప్రతి రోజు వాటిని చూడడానికి అనేక మంది సందర్శకులు లక్షల సంఖ్యలో సందర్శిస్తుంటారు.ఎవరు వెళ్ళినా సరే అక్కడి పర్యాటక అధికారులు వారిని సాదరంగా ఆహ్వానం చెబుతారు.
అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నారు అని అనుకుంటున్నారా…? ఇక అసలు విషయంలోకి వెళితే…
ఫిన్లాండ్ దేశంలో ఓ ఐలాండ్ ఉంది.ఇక ఆ ఐలాండ్లో కేవలం ఆడవారికి మాత్రమే అనుమతిస్తారట.
పురుషులు మాత్రం నో ఎంట్రీ.ఇక ఈ ఐలాండ్ సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… ఫిన్లాండ్ దేశం తీరప్రాంతంలో ఎనిమిది ఎకరాల్లో ఉన్న ఈ ఐలాండ్ పేరు ‘ సూపర్ షి ‘.
ఈ ఐలాండ్ కు ఒక ఓనర్ కూడా ఉన్నారండోయ్.ఆ యజమాని పేరు క్రిస్టినా రూట్.
అయితే ఆమె కాస్త బిన్నంగా ఆలోచించి మహిళల కోసం సపరేట్ గా రిసార్టు ఏర్పాటు చేయాలని భావించారు.ఇకపోతే అదే ఆలోచనతో అక్కడ ప్రత్యేకంగా ఓ రిసార్టులో ఏర్పాటు చేసి అందులో కేవలం స్త్రీలకు మాత్రమే ఎంట్రీ ఇచ్చే విధంగా రూల్స్ ను తయారు చేసింది.
దీంతో కేవలం ఆ ఐలాండ్ కు ఆడవారు మాత్రమే పర్యాటకులు వస్తున్నారు.
ఫ్రెండ్స్, సహా ఉద్యోగులు, బంధువులు ఎవరైనా సరే ఒక పది, పదిహేను మంది మహిళలు కలిసి ఒక బృందంగా ఏర్పడి ఐలాండ్ కు చేరుకుని అక్కడ ఉన్న రిసార్టులో రిలాక్స్ అవ్వచ్చు.
పురుషాధిక్యత ఎక్కువగా ఉందని భావిస్తున్న స్త్రీలు ఇక్కడికి చేరుకొని వారి జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని ఆవిడ చెబుతున్నారు.అంతేకాదు, అక్కడ ప్రపంచానికి దూరంగా… మగవారికి నచ్చే విధంగా కాకుండా వారికి నచ్చే విధంగా ప్రశాంతంగా జీవితం గడపవచ్చని, అలాగే అక్కడికి వచ్చిన వారు మనసు విప్పి మాట్లాడుకోవచ్చని యజమాని తెలియజేస్తున్నారు.