హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ ఆదాశర్మ.మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసిన ఈ భామకి తరువాత అనుకున్న స్థాయిలో అవకాశాలు అయితే రాలేదు.అలా అప్పుడప్పుడు ఒకటి, అర సినిమాలు చేస్తూ వస్తుంది.హిందీలో కూడా ఆదా శర్మ కెరియర్ అలాగే ఉంది.అయితే ఈ అమ్మడు సినిమాల కంటే సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంది.సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్, డిఫరెంట్ వీడియోలు, యోగా, ఫన్నీ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది.
అలాగే అప్పుడప్పుడు ఫ్యాన్స్ తో కూడా ముచ్చట్లు పెడుతుంది.ఈ కారణంగా సోషల్ మీడియాలో ఆదా శర్మని ఫాలో అయ్యేవారు మిలియన్స్ లో ఉన్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో రెండు తెలుగు సినిమాలు, ఒక హిందీ సినిమా ఉంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ భామ తన ఇన్స్టాగ్రామ్ లో ఆసక్తికరమైన వీడియో ఒకటి పోస్ట్ చేసింది.
దానికి అంతే ఆసక్తికరంగా కామెంట్ పెట్టింది.
ఆ వీడియోలో ఆదాశర్మ పియానో ప్లే చేసింది.
ఈ భామ యాక్టర్ కంటే ముందు మంచి క్లాసికల్ డాన్సర్ కూడా, అయితే ఇప్పుడు తనకి మ్యూజిక్ టేస్ట్ కూడా ఉందని పియానో వాయిస్తూ వీడియో షేర్ చేసింది.దీనికి నెపోటిజం లేదా ఫేవరేటిజం ఏదైనా కానీ సినిమా రంగం నుండి నన్ను బయటకు పంపేసినా, మరో ప్రొఫెషన్ గా పియానో నేర్చుకున్నాను.
ఇంతకు ముందు దోసలు వేయడం నేర్చుకున్నా.అయితే అది వర్క్ అవుట్ అవ్వలేదు.ఏది ఏమైనా నేను నటిగానే సినిమాల్లో కొనసాగడానికి ప్రయత్నిస్తాను.ఎందుకంటే అది నా కల అని మేసేజ్‌ను పెట్టింది.
దీనిని బట్టి నటిగా తనకి వచ్చిన సినిమా అవకాశాలు చేసుకుంటూ వెళ్తాను తప్ప నెపోటిజం అంటూ ఆలోచించి వేస్ట్ చేసేంత టైం పెట్టుకోనని ఆదాశర్మ తన పోస్ట్ ద్వారా క్లారిటీ ఇచ్చింది.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.