లవర్ ఉద్యోగం కోసం అమ్మాయి కావాలంట... వైరల్ అవుతున్న డాక్టర్ పోస్ట్

ఈ రోజుల్లో ప్రేమించే అమ్మాయిలు దొరకడమే కష్టం అయిపోతుంది.ఒక వేళ ఏ అమ్మాయి అయిన ప్రేమించిన కొద్ది రోజులకి తన కంఫర్ట్ చూసుకొని బ్రేక్ అప్ చెప్పేసి వెళ్ళిపోతుంది.

 Doctor Posts Job Vacancy For The Position Of Ladylove, Malaysian Doctor, Social-TeluguStop.com

ఈ కారణంగా ప్రతి ఒక్కరి లైఫ్ లో బ్రేక్ అప్ కథలు చాలా ఉంటాయి.అయితే విడిపోవడంలో కొంత ఆనందం వెతుక్కుంటే, కొంత మంది అమ్మాయి ప్రేమ దూరం అయిపోయింది అని బాధలో జీవిస్తూ ఉంటారు.

అయితే మరికొందరు మాత్రం ప్రేమించిన అమ్మాయి వదిలేసిన పెద్దగా లెక్క చేయకుండా ఈ సారి ప్రేమించబోయే అమ్మాయి విషయంలో కాస్తా కేర్ ఫుల్ గా ఉండటంతో పాటు ఒక్కోసారి కొత్తగా ప్రయత్నం చేస్తారు.ఇప్పుడు అలాగే ఓ కుర్రాడు.

తన దగ్గర లవర్ ఉద్యోగం ఖాళీగా ఉందని అందమైన అమ్మాయిలు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని ఒక ట్వీట్ పోస్ట్ పెట్టాడు.ఇప్పుడు అది ట్విట్టర్ లో వైరల్ అవుతుంది.

ఎందుకు అంతగా వైరల్ అవుతుంది అంటే.అందులో తన గురించి కూడా ఆ అబ్బాయి చెప్పుకొచ్చాడు.

మలేషియాకు చెందిన డాక్టర్ మహమ్మద్ నకీబ్ ఉద్యోగ అవకాశం అంటూ ఓ ట్వీట్ పోస్ట్ చేశాడు.తన జీవితంలో లేడీ లవ్ గా ఉద్యోగం చేసేందుకు పరిపక్వత కలిగిన అమ్మాయి కావాలని కోరాడు.

ఆమెకు వంట చేయడంతోపాటు మీమ్స్ షేర్ చేయడం కేక్స్ చేయాలని చెప్పాడు.అలాగే అతడితో కలిసి నిద్రపోవాలని చెప్పుకొచ్చాడు.నకీబ్ తన క్వాలిటీస్ ను కూడా వివరించాడు.తన చేతిలో ఒక చాక్లెట్ బార్ ఉంటుందని దాన్ని ఎప్పుడు నోరు మూసుకుని చప్పరిస్తూ ఉంటానని తెలిపాడు.

తాను ఒక డాక్టర్ అని కారు కూడా ఉందని, కానీ ఇప్పటికీ తాను పేదవాడినేనని తెలిపాడు.నేను చూసేందుకు అందంగా ఉండను.

కానీ మీకు మంచిగానే కనిపిస్తాను.పైగా నేను పెద్ద ప్రమాదకారిని కూడా కాదు.

ఎత్తులంటే మాత్రం చచ్చేంత భయం అని చెప్పుకొచ్చాడు.ఈ జాబ్ చేసే అమ్మాయికి పెర్ఫార్మెన్స్ బర్త్ డే బెనిఫిట్స్ కోసం నెలకు కమీషన్లు ఇస్తానని వెల్లడించాడు.

తనతో ప్రతి రోజు ఉండాలని, తన జోకులకు తప్పకుండా నవ్వాలని తెలిపాడు.అలా ఉంటేనే తన ఫ్యామిలీ ఈవెంట్స్ కి తీసుకెళ్తానని చెప్పాడు.

ఇవన్నీ అతడు ఓ ప్రజంటేషన్ సాఫ్ట్వేర్ ద్వారా ట్విట్టర్లో సరదాగా పోస్టు చేశాడు.ఇప్పుడు ఆ పోస్ట్ ట్విట్టర్ లో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube