కరోనా నేపథ్యంలో షూటింగ్ లు అన్ని ఆగిపోవడం తో నటీనటులు అందరూ కూడా ఒకరకమైన డిప్రెషన్ కు గురవుతున్నారు.ఈ క్రమంలో వారి ఆరోగ్యాలు దెబ్బతిని కొందరు ఆసుపత్రి పాలవుతుండగా కొందరు పిచ్చిగా ఆలోచించి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
గత అర్ధరాత్రి తెలుగు సీరియల్ మనసు మమత నటి శ్రావణి ఆత్మహత్య ఘటన అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేయగా,ఇంకా ఆ ఘటన మరువక ముందే మరో ప్రముఖ నటి క్రిటికల్ కండీషన్ లో ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తుంది.చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ బామ్మా,ప్రముఖ నటి సురేఖ సిఖ్రి బ్రెయిన్ స్టోక్ తో ముంబై లోని క్రిటి కేర్ ఆసుపత్రిలో జాయిన్ అయినట్లు తెలుస్తుంది.
సినిమా,టీవీ,నాటక,రంగంలో సురేఖ సిఖ్రి తనదైన విలక్షణ నటనతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.బ్రెయిన్ స్టోక్ రావడం తో 75 ఏళ్ల సురేఖ సిఖ్రి ని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని, పరిస్థితి విషమంగానే ఉందని హాస్పిటల్ వర్గాలు చెబుతున్నాయి.
1978లో ఈమె నటనారంగంలోకి అడుగు పెట్టగా, అనువాద సీరియల్ చిన్నారి పెళ్లికూతురు ద్వారా ఈమె తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలే.అయితే 2018లో ఒకసారి ఆమెకు బ్రెయిన్ స్టోక్ రాగా, ఇప్పుడు మరోసారి ఆమెకు అదే సమస్య వచ్చినట్లు తెలుస్తుంది.దీనితో ఆమె పరిస్థితి పై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.‘తామస్, మామ్మో, బదాయి హో’ చిత్రాల్లో నటనకు ఈమె జాతీయ అవార్డులను కూడా దక్కించుకున్నారు.