మన హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి అయిన ఆడవారు మంగళ సూత్రం ధరించడం మన ఆచారం.అంతేకాక మంగళసూత్రంతో పాటు వాటిలో ముత్యాలు, పగడాలు కూడా ధరిస్తుంటారు.
వీటిని కేవలం అలంకారానికి మాత్రమే కాకుండా దీర్ఘసుమంగళీగా ప్రాప్తిచేకూరుతుంది.స్త్రీలు మంగళ సూత్రాలతో పాటు ముత్యాలు, పగడాలు ధరించడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఎప్పుడైనా తెలుసుకున్నారా? మరి ఆ లాభాలు ఏంటి? వాటిని ధరించడం ద్వారా ఏం జరుగుతుంది అనే మనం ఇక్కడ చదివి తెలుసుకుందాం.
ముత్యాలు, పగడాలు ఈ రెండూ కూడా నవరత్నాలలో రెండు రత్నాలు.ముత్యాలు రత్నాలలో రెండవ రత్నం.దీనినే చంద్రుని రత్నం అని కూడా అంటారు.ఈ ముత్యాన్ని స్త్రీ తన మంగళసూత్రంలో ధరించడం ద్వారా ప్రశాంతతను, సహనాన్ని చేకూరుస్తుంది.
ముత్యం చంద్రునికి ప్రతీక దీనిని ధరించిన వారు చంద్రుని వలె ప్రశాంతతను కలిగి ఉంటారు.

పగడం సూర్యునికి, కుజునికి ప్రతీక.కుజ దోషం ఉన్న వారు పగడం ధరిస్తే కుటుంబంలో ఉండే మనస్పర్థలు, కలతలు దూరమవుతాయి.పగడం నాడీమండల పని తీరును చురుగ్గా ఉంచుతుంది.
మరి ఇటువంటి ముత్యాలు, పగడాలు స్త్రీలు తమ మంగళ సూత్రంలో ధరించడం ద్వారా సూర్య, చంద్రకాంతులను తనలో నిక్షిప్తం చేసుకున్నట్లు ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు.
అలాగే మహిళలు నుదిటిన ఎరుపు రంగు బొట్టు పెట్టుకోవాలి అని చెప్తూ ఉంటారు.ఎరుపు రంగు బొట్టు పాజిటివ్ ఎనర్జీని గ్రహించి.మన శరీరం కోల్పోయిన ఎనర్జీని మెరుగుపరిచి అలాగే ఏకాగ్రతను కూడా పెంచుతుంది.