ఆధార్ బయోమెట్రిక్ ఇంట్లో ఉండే లాక్, అన్‌ లాక్ ఇలా చేయండి...!

ఆధార్.ఆ పేరు ఊరికే పెట్టలేదు.అది కేవలం 12 అంకెల సంఖ్య మాత్రమే కాదు.మన సమస్త ఆధారం అందులోనే ఉంటుంది.ఆ కార్డే మనకు ఆధారం అన్న మాట.అందుకే దానికి ఆ పేరు పెట్టారు.ఆధార్ గుర్తింపు సంఖ్య మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది.దీని ద్వారా చాలా పనులు మనం ఆన్‌ లైన్ పోర్టల్ uidai.gov.in లో చేయవచ్చు.అయితే ఒక్కోసారి ఆన్ ‌లైన్ సేవలు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది.బయో మెట్రిక్ ద్వారా ఆధార్‌ ను దుర్వినియోగం చేసే అవకాశం లేకపోలేదు.హ్యాకర్ల నుంచి మన ఆధార్ ను రక్షించడానికి బయోమెట్రిక్ వివరాలను లాక్ చేయవచ్చు.లేదా అన్ ‌లాక్ చేసుకోవచ్చు.ఇపుడు వాటి వివరాలను తెలుసుకుందాం.

 Lock, Un Lock, Aadhar, Uidai, Number, Fingers, Bio Metric, Otp-TeluguStop.com

మనం ఇంట్లో నుండే ఆన్‌ లైన్ బయోమెట్రిక్ లాక్ చేయవచ్చు.దీనికి తొలుత ఆధార్ వెబ్‌ సైట్ https://uidai.gov.in/ కు వెళ్లి.హోమ్ పేజీలో కొంచెం క్రిందికి వస్తే.అక్కడ ఆధార్ సర్వీసెస్ విభాగం కనిపిస్తుంది.అక్కడ లాక్ / అన్ ‌లాక్ బయోమెట్రిక్స్ ఎంపికను క్లిక్ చేయండి.ఇప్పుడు మీ 12 అంకెల ఆధార్ నంబర్ ‌ను నమోదు చేయాలి.కావాలంటే, వర్చువల్ ఐడి నంబర్ ఎంపికను కూడా ఎంచుకోవచ్చు.

ధృవీకరణ కోసం క్యాప్చాను ఎంటర్ చేసి, ఓటీపీ పై క్లిక్ చేసి, తరువాత క్రొత్త పాప్ అప్ ‌లో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో కనిపించే ఓటీపీ ని నమోదు చేయాలి.తరువాత, సమర్పించుపై క్లిక్ చేస్తే సరి.ఆధార్ బయోమెట్రిక్ లాక్ చేయబడుతుంది.

అలాగే.

బయోమెట్రిక్ ‌లను అన్ ‌లాక్ చేయడానికి, సేమ్ టు సేమ్ అదే విధానాన్ని అనుసరించాలి.తరువాత, ‘అన్ ‌లాక్ బయోమెట్రిక్’ పై క్లిక్ చేయాలి.

తద్వారా.బయోమెట్రిక్స్ కొన్ని నిమిషాల పాటు అన్‌ లాక్ చేయబడతాయి.

అన్‌ లాక్ సమయంలో మన ఆధార్ సంఖ్యను ప్రామాణీకరించడానికి మనం వేలిముద్ర / విద్యార్థి వంటి బయోమెట్రిక్‌లను ఉపయోగించవచ్చు.అదే సమయంలో, మన బయోమెట్రిక్‌ లను శాశ్వతంగా అన్‌ లాక్ చేయాలనుకుంటే మాత్రం ‘లాకింగ్ ఫీచర్‌ ను ఆపివేయి’ పై క్లిక్ సరిపోతుంది.

ఇక పూర్తిగా బయోమెట్రిక్ అన్‌ లాక్ అయిపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube