రాజీనామాకు సిద్దమయిన ఆజాద్‌, బుజ్జగిస్తున్న సోనియా

ఇటీవల జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ సీనియర్‌ నాయకులపై రాహుల్‌ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.సీనియర్ల వల్ల పార్టీ చాలా నష్టపోతుందని అన్నాడు.

 Soina Gandhi Calls To Azad , Gulab Nabi Azadh, Sonia Gandhi, Cwc Meeting, Rahul-TeluguStop.com

ఇదే సమయంలో ఆయన మాట్లాడుతూ కొందరు సీనియర్‌ లు బీజేపీకి సహకరించేలా పనులు చేస్తున్నట్లుగా కూడా వ్యాఖ్యలు చేశారు.అందులో పరోక్షంగా పార్టీ సీనియర్‌ నేత గులామ్‌ నబీ ఆజాద్‌ ను కూడా పేర్కొనడంతో ఆయన తీవ్ర మనస్థాపంకు గురయ్యాడట.

ఈ విషయంఫై ఆయన పార్టీ తీరుతో ఏకీభవించకుండా రాజీనామాకు సిద్దం అయినట్లుగా తెలుస్తోంది.

సుదీర్ఘ కాలంగా పార్టీలో ఉన్న గులాం నబీ ఆజాద్‌ రాజీనామాకు సిద్దం అవ్వడంతో వెంటనే పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆయనతో మాట్లాడేందుకు సిద్దం అయ్యిందట.

రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలకు నొచ్చుకోవద్దంటూ కోరినట్లుగా సమాచారం అందుతోంది.ఇప్పటికే ఒకసారి ఆజాద్‌ తో ఫోన్‌ లో మాట్లాడిన సోనియా గాంధీ మరోసారి ఆయనతో మాట్లాడబోతుందట.పార్టీ ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న సమయంలో సీనియర్‌ లపై రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు మరింతగా పార్టీని కష్టాల్లోకి నెట్టినట్లయ్యిందని కొందరు పార్టీ నేతలు అంటున్నారు.మరి ఈ విషయంలో రాహుల్‌ గాంధీ తీరు ఎంటీ, ఆయన తన మాటలపై నిలబడి తన వ్యాఖ్యలను సమర్థించుకుంటాడా చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube