‘వి’ ట్రైలర్ టాక్: ఇది సైడ్ బిజినెస్ అంటోన్న నాని!

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వి’ ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది.ఈ సినిమాను దర్శకుడు ఇంద్రగంటి మోహన్‌కృష్ణ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై మొదట్నుండీ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Nani V Movie Trailer Talk, Nani, V Movie, Sudheer Babu, Mohankrishna Indraganti,-TeluguStop.com

ఇక ఈ సినిమాలో నానితో పాటు మరో యంగ్ హీరో సుధీర్ బాబు కూడా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.కాగా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేశారు.ఈ ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.నాని మరోసారి తన పర్ఫార్మెన్స్‌తో ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లనున్నట్లు కనిపిస్తుంది.ఇక పూర్తిగా సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో నాని వరుసగా హత్యలు చేస్తూ కనిపిస్తున్నాడు.

అటు నానిని పట్టుకునే పోలీస్ ఆఫీసర్‌గా సుధీర్ బాబు కనిపిస్తున్నాడు.నాని ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు, దాని వెనకాల ఉన్న కారణం ఏమిటనేది ఈ సినిమా కథగా ఉండబోతున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

మొత్తానికి మరోసారి నాని తాను నేచురల్ స్టార్ అని ఎందుకు అనిపించుకుంటున్నాడో ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ చూస్తే కనిపిస్తుందని ‘వి’ చిత్ర ట్రైలర్‌లో చూపించేశారు.ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా నివేదా థామస్, అదితిరావు హైదరీ నటిస్తున్నారు.

కాగా ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండగా, ఈ సినిమాను సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube