తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తున్న ఏపీలోని గన్నవరం నియోజకవర్గం మంచి టిడిపి తరపున ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ మోహన్ కొద్ది నెలల క్రితం టిడిపికి రాజీనామా చేసి, వైసిపికి అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.ఆయన వైసీపీలో చేరకపోయినా, చేరినట్టు గానే అన్ని వ్యవహారాలను చక్కబెడుతూ వస్తున్నారు.
అయితే వంశీ రాకను మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన యార్లగడ్డ వెంకట్రావు.ఇప్పటికే వంశీ రాకపై అగ్గిమీద గుగ్గిలం లా మారిన యార్లగడ్డను బుజ్జగించేందుకు జగన్ యార్లగడ్డకు కృష్ణాజిల్లా డిసిసిబి చైర్మన్ పదవిని కట్టబెట్టారు.
అయినా గన్నవరం నియోజకవర్గంలో వంశీ కి శత్రువులు తయారవుతూనే వస్తున్నారు.
ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి కీలక నాయకుడు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకటరావు ఇద్దరూ వంశీ రాకపై మొదటి నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితుల్లోనే, తాజాగా గన్నవరం నియోజకవర్గం నుంచి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, తానే అభ్యర్థి అంటూ వంశీ ప్రకటించడంపై ఈ ఇద్దరు నేతలు ఆగ్రహంతో ఉన్నారు.
వంశీ వ్యాఖ్యలపై స్పందించిన గట్టు రామచంద్ర రావు, తాను 40 ఏళ్ల నుంచి కష్టమైనా, నష్టమైనా జగన్ కుటుంబం తోనే నడిచానని, జగన్ వైసీపీ ని స్థాపించిన తర్వాత జగన్ వెంటే ఉన్నన్ని, గన్నవరం నియోజకవర్గంలో పని చేసినా, జగన్ తనను సంప్రదిస్తారు అని గట్టు రామచంద్రరావు చెబుతున్నారు.
వంశీ పదేళ్ల నుంచి నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలను అనేక ఇబ్బందులకు గురి చేశారని, ఇప్పుడు ఈ నియోజకవర్గానికి అన్నీ నేనే అని ఎమ్మెల్యే వంశీ ప్రకటించుకుంటున్నారు అని వంశీ వెంట నడిచిన వారికి ఇప్పుడు వైసీపీలో పదవులు ఇస్తున్నారని, మొదటి నుంచి వైసీపీతో ఉన్న నాయకులను వేధిస్తున్నారని , ఇంతకాలం పార్టీని కార్యకర్తలు అంటిపెట్టుకునే ఉంది ఇందుకేనా అంటూ గట్టు ప్రశ్నించారు గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా తాను పోటీ చేస్తానని, రౌడీలు ఫ్యాక్షనిస్టులు నన్ను ఏమి చేయలేరు అంటూ గట్టు ప్రకటించడం ఇప్పుడు సంచలనంగా మారింది.
వైసిపి కార్యకర్తల మీద చెయ్యి వేయాలంటే, అది నా ప్రాణం పోయిన తర్వాత మాత్రమేనని, తాను చనిపోతే వైసీపీ జెండా కప్పుకునే చస్తాను అంటూ గట్టు ప్రకటించుకోవడం ఇప్పుడు నియోజకవర్గం లో హాట్ టాపిక్ గా మారింది.అంతే కాకుండా 15 రోజుల్లో చల్లని కబురు చెబుతానంటూ గట్టు ప్రకటించడంపై అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది.
15 రోజుల్లో చెప్పబోయే ఆ చల్లని కబురు ఏంటి ? జగన్ గుట్టా కు ఏదైనా పదవి ఇస్తానని హామీ ఇచ్చారా లేక గన్నవరం లో ఎన్నికలు జరిగితే అభ్యర్థి దుట్టా రామచంద్రరావు అని జగన్ ప్రకటిస్తారా అనే ఆసక్తి ఇప్పుడు నియోజకవర్గం లో నెలకొంది.