హీరో కూతురుతో క్రికెటర్ ప్రేమాయణం.. క్లారిటీ వచ్చేసింది

బాలీవుడ్ హీరోయిన్స్ తో మన ఇండియన్ క్రికెటర్లు ప్రేమాయణంకి సంబందించిన కథల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.దశాబ్దాల క్రితమే ఈ క్రికెటర్, సినిమా నటీమణుల ప్రేమ కథలు స్టార్ట్ అయ్యాయి.

 Athiya Shetty Makes Her Relationship With Kl Rahul, Bollywood, Indian Cricket, A-TeluguStop.com

ఇక విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా లాంటి క్రికెటర్స్ ఈ ట్రెండ్ ని కొనసాగిస్తూ ఉన్నారు.ఇప్పటి వారు బాలీవుడ్ హీరోయిన్స్ ని తమ జీవిత భాగస్వాములుగా చేసుకున్నారు.

ఇక ఈ దారిలోనే మరో యంగ్ క్రికెటర్ కె.ఎల్.రాహుల్ కూడా వచ్చి చేరిపోయాడు.కర్ణాటకకి చెందిన రాహుల్ బ్యాట్స్ మెన్ గా ఇండియన్ క్రికెట్ టీంలో సత్తా చాటుతున్నాడు.

ఇక బయట కూడా ఈ యంగ్ క్రికెటర్ అమ్మాయిలతో రిలేషన్స్ విషయంలో కాస్తా స్పీడ్ గానే ఉంటాడనే టాక్ ఉంది.గతంలో నిధి అగర్వాల్ తో ఈ క్రికెటర్ ప్రేమాయణం సాగించినట్లు వార్తలు వచ్చిన వాటిలో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు.

అయితే బాలీవుడ్ నటి, ఒకప్పటి హీరో సునీల్ శెట్టి కూతురు అథియా శెట్టితో కె.ఎల్ రాహుల్ ప్రేమలో ఉన్నాడంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి.ఈ వార్తలకి తాజాగా మరింత బలం చేకూరింది.అతను లవ్ సింబల్ ఎమోజీని పోస్టు చేసిన రాహుల్ తమ మధ్య ఉన్న బంధాన్ని ఇలా బయటపెట్టాడు.తల్లి పుట్టిన రోజును పురస్కరించుకుని అథియా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తల్లిని ఆప్యాయంగా హత్తుకుని ఉన్న ఫొటోను షేర్ చేసింది.తన తల్లికి ఏ పదాలు సరితూగవని, ఐలవ్యూ అమ్మా అని దానికి క్యాప్షన్ తగిలించింది.

అథియా పోస్టుకు రాహుల్ స్పందించాడు.లవ్ సింబల్ ఎమోజీని పోస్టు చేసి పజిల్ విప్పేశాడు.

తాను కూడా ప్రేమిస్తున్నట్టు చెప్పకనే చెప్పాడు.మరి వీళ్ళు తమ ప్రేమ విషయాన్ని నేరుగా ఇప్పుడు క్లారిటీ ఇస్తారు అనే విషయం కోసం చాలా మంది ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube