తెలుగు ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి స్టార్ మా ఛానల్ లో సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు ప్రసారమయ్యే “కోయిలమ్మ” అనే ధారావాహికలో నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న చిన్ని అలియాస్ తేజస్వి గౌడ తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే.అయితే ఇటీవలే నటి తేజస్వి గౌడ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొంది.
ఇందులో భాగంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకుంది.
అయితే ఇందులో భాగంగా తాను కర్ణాటక రాష్ట్రంలోని తుంకూర్ జిల్లా లో పుట్టి పెరిగానని తెలిపింది.
అలాగే ఇంజనీరింగ్ లో సివిల్స్ మరియు మాస్ కమ్యూనికేషన్ పూర్తి చేశానని అంతేగాక క్యాంపస్ ప్లేస్ మెంట్స్ లో ఉద్యోగం సాధించి నాలుగు నెలలు పాటు సాఫ్ట్ వేర్ ఉద్యోగం కూడా చేశానని తెలిపింది.ఆ తరువాత అనుకోకుండా తెలిసిన వారి ద్వారా కోయిలమ్మ సీరియల్ ఆడిషన్స్ కి హాజరుకాగా మొదటి పరీక్షలోనే సెలెక్ట్ అయ్యానని ఎస్ తేజస్వి గౌడ చెప్పుకొచ్చింది.
ఆ విధంగా తన నటనలో కెరియర్ స్టార్ట్ అయిందని తెలిపింది.
అయితే తనని తెలుగు ప్రేక్షకులు కోయిలమ్మ సీరియల్ లో ఎంతగానో ఆదరించారని అంతేగాక తాను ఎక్కడికి వెళ్లినా చాలా బాగా చూస్తున్నారని ఆ విషయం తనకు బాగా నచ్చిందని దీంతో తెలుగు ప్రేక్షకులకి తాను ఎంతో రుణపడి ఉన్నానని చెప్పుకొచ్చింది.
అంతే గాక తెలుగు సినీ పరిశ్రమలో తానెప్పుడూ క్యాస్టింగ్ కౌచ్ సంబంధిత సమస్యలను ఎదుర్కోలేదని ఒకవేళ తాను అలాంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తే మాత్రం ఖచ్చితంగా చాకచక్యంగా ఎదుర్కొంటానని తెలిపింది.