రామ్ గోపాల్ వర్మ కొన్ని రోజుల క్రితం రిపబ్లిక్ టీవీ అధినేత అర్నబ్ గోస్వామిపై సినిమా చేస్తున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే.బాలీవుడ్‌పై అర్నబ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
సుశాంత్ మరణంకు బాలీవుడ్ లో ఉన్న కొందరు కారణం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై వర్మ చాలా సీరియస్ అయ్యాడు.బాలీవుడ్‌లో ఉన్న కుళ్లు కుతంత్రాలను అర్నబ్ వెలుగెత్తి చెప్పడంతో వర్మ కు కోపం వచ్చింది.
చాలా మంది బాలీవుడ్ వారు కూడా ఈ విషయమై కోపం తెచ్చుకున్నారు.కాని ఎవరు కూడా నోరు తెరవలేదు.
వర్మ మాత్రం అర్నబ్‌పై సినిమాను చేస్తానంటూ ప్రకటించాడు.
ప్రకటించిన కొన్ని రోజుల్లోనే వర్మ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తాడు.
కాని ఇప్పటి వరకు వర్మ ఆ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ ఇవ్వక పోవడంతో అసలు ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.నేడు అందుకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను విడుదల చేశాడు.
అర్నబ్ ది న్యూస్ ప్రొస్టిట్యూట్ అనే టైటిల్‌తో మోషన్ పోస్టర్‌ను కాస్త సీరియస్‌గానే విడుదల చేశాడు.రామ్ గోపాల్ వర్మ అర్నబ్ సినిమాను పక్కకు పెట్టాడేమో అనుకున్నారు.
కాని ఆయన మాత్రం సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేయడంతో పాటు వచ్చే నెలలో సినిమాను విడుదల చేస్తానంటూ హింట్ ఇచ్చాడు.