దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వారు ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి.ఇక ఈ సినిమాను తొలుత అనౌన్స్ చేసినప్పుడు ఈ సినిమాను 2020 జూలై 30న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది.
అయితే అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే, ఆర్ఆర్ఆర్ చిత్రం నేడు రిలీజ్ అయ్యేది.దీంతో థియేటర్ల వద్ద ఎలాంటి పండగ వాతావరణం ఉండేదో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.కాగా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని జూలై 30న చూస్తున్నట్లు, ఈ సినిమా రివ్యూ చెబుతున్నట్లు ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మెమీస్‌తో దుమ్ములేపుతున్నారు.ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసిందని, అదిరిపోయే రెస్పాన్స్‌ను ఈ సినిమా దక్కించుకుందని వారు అంటున్నారు.
మొత్తానికి ఈ సినిమా నేడు రిలీజ్ అయ్యి ఉంటే ఎలాంటి పండగ వాతావరణం ఉండేదో అని ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు.కాగా సినిమా ప్రొడక్షన్ పనుల ఆలస్యం వల్ల ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి వాయిదా వేశారు.
కానీ ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా మరింత ఆలస్యం అవుతుండటంతో సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో అని ప్రేక్షకులు సందేహ పడుతున్నారు.ఇక భారీ బడ్జెట్ చిత్రంగా వస్తున్న ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.