కొంతమంది అధికారులు వారు చేస్తున్న పనిని ఎంతో గౌరవంగా స్వీకరిస్తూ పని చేసుకుంటూ వెళ్తుంటారు.అయితే మరి కొందరు వారికిచ్చిన అధికారాన్ని వారి సొంతానికి వినియోగించుకోవడంతో వారి డిపార్ట్మెంట్ కు చెడ్డపేరు తీసుకువస్తున్నారు.
తాజాగా ఈ పరిస్థితి నేవి అధికారులలో చోటు చేసుకుంది.ప్రజల నుండి గౌరవం పొందే రక్షణ వ్యవస్థలో ఉండే ఇలాంటి పరిస్థితి నెలకొని ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది.
కాసుల కక్కుర్తి కొరకు సొంత డిపార్ట్మెంట్ ని మోసం చేశారు కొందరు నేవీ అధికారులు.
తాజాగా నలుగురు నేవీ అధికారులు తప్పుడు బిల్లులు అందజేసి ఏకంగా ఆరు కోట్లకు పైగా అంద చేయడంతో వారిపై సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది.
ఇందుకు సంబంధించి కమాండ్ ఆర్మీ శర్మ, కమాండర్ గడ్బొలే, అఖిల్ కులకర్ణి, ఆఫీసర్ కుల్దీప్ సింగ్ లు తప్పుడు బిల్లు పెట్టి మోసం చేయడంతో వారిపై కేసులు నమోదు చేశారు.వీరందరూ ముంబాయి పశ్చిమ నావికా దళంలో పనిచేస్తున్నారు.నేవల్ కమాండ్ ఆఫీసుకు కంప్యూటర్ తో పాటు ఇతర సామాగ్రి చీర వేసినట్లుగా ఏకంగా 6.7 కోట్లు మేర తప్పుడు బిల్లును సృష్టించి కాజేయలని ఆలోచించారు.
అయితే వారు సృష్టించిన బిల్లుల ప్రకారం ఎలాంటి కంప్యూటర్ పరికరాలు అక్కడ చేరకపోవడంతో అనుమానం వచ్చిన అధికారులు పూర్తి విచారణ జరపగా, ఈ వ్యవహారం బయటకు వచ్చింది.కొన్ని సంస్థలకు సంబంధించి తప్పుడు బిల్లులు ఇన్వాయిస్ లో ఆర్డర్స్ లాంటివి సృష్టించి ఆ డబ్బును కాజేయాలని వారు అనుకున్నారు.
ఇందుకు సంబంధించి ఆ వస్తువులను 2016 సంవత్సరం జనవరి- మార్చి నెలల మధ్యలో వస్తువులు కొన్నట్లు వారు చూపించారు.అయితే వారు చేసిన మోసం బట్టబయలు కావడంతో వారితో పాటు, వారికి సహకరించిన ప్రైవేట్ సంస్థలపై కూడా సిబిఐ కేసులు పెట్టింది.
అంతేకాకుండా ఇందుకు సంబంధించి పలుచోట్ల సిబిఐ సోదాలు నిర్వహిస్తున్నారు.