అమెరికా ప్రజలకు మోడీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు: ట్రంప్ రిప్లై వైరల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా ప్రజలకు.భారత ప్రధాని నరేంద్రమోడీ 244వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

 America Loves India, Trump Responds To 'friend' Pm Modi , Us 244th Independence-TeluguStop.com

‘భారత్, అమెరికాలు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలన్న ఆయన.స్వేచ్ఛ, మానవ సమానత్వాన్ని ఆచరిస్తూ జరుపుకునేదే స్వాతంత్య్ర దినోత్సవం అంటూ ట్వీట్ చేశారు.ఆ వెంటనే మోడీ ట్వీట్‌కు ట్రంప్‌ రిప్లయ్ ఇచ్చారు.‘‘ నా మిత్రునికి ధన్యవాదాలు, అమెరికా భారతదేశాన్ని ప్రేమిస్తుందని ట్వీట్ చేశారు.

శనివారం దక్షిణ డకోటా ప్రాంతంలో జరిగిన అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ట్రంప్ పాల్గొన్నారు.అనంతరం జాతినుద్దేశించి మాట్లాడుతూ.

కోవిడ్ 19 మహమ్మారి దేశంలోకి ప్రవేశించక ముందు ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించని ఘనతను అమెరికా సాధించినట్లు ట్రంప్ పేర్కొన్నారు.వైరస్ దేశంలోకి ప్రవేశించిన తర్వాత క్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయని.

అయినప్పటికీ ఈ మహమ్మారిని అమెరికా సమర్థవంతంగా ఎదుర్కొంటోందని ఆయన స్పష్టం చేశారు.దేశంలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Telugu America India, Julyth, Trumpresponds-

కాగా ప్రతియేటా జూలై 4న అమెరికన్లు స్వాతంత్య్ర దినోత్సవంగా జరుపుకుంటారు.ఎంతో అట్టహాసంగా జరుపుకునే ఈ వేడుకలు ఈసారి కరోనా కారణంగా చాలా నిరాడంబరంగా జరిగాయి.మరోవైపు కరోనా దెబ్బకు అగ్రరాజ్యం చిగురుటాకులా వణుకుతోంది.గత 24 గంటల్లో ఏకంగా 57,683 కేసులు నమోదయ్యాయి.అమెరికాలో ఒక్కరోజులో ఇన్ని కేసులు బయటపడటం ఇదే తొలిసారి.అలాగే, వైరస్ కారణంగా 728 మంది ప్రాణాలు కోల్పోయారు.

తాజా కేసులతో కలుపుకుని అమెరికాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,12,166కు చేరుకోగా, 1,32,196 మంది మరణించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube