ఈనెలలో కూడా ప్రారంభం కాని ఆ షూటింగ్స్‌

కరోనా మహమ్మారి కారణంగా దాదాపు మూడు నెలల పాటు షూటింగ్స్‌కు బ్రేక్‌ పడినది.

తెలుగు రాష్ట్రాలు లాక్‌ డౌన్‌ సడలించిన నేపథ్యంలో షూటింగ్స్‌కు అనుమతులు ఇచ్చిన విషయం తెల్సిందే.

గత నెల ఆరంభంలోనే షూటింగ్స్‌కు అనుమతులు వచ్చాయి.అయితే కేవలం బుల్లి తెరకు చెందిన వారు మాత్రమే పూర్తి స్థాయిలో షూటింగ్స్‌కు వెళ్లారు.

కాని సినిమాలు మాత్రం షూటింగ్‌ ప్రారంభం అయ్యింది చాలా తక్కువ.జులై నెల నుండి సినిమాల షూటింగ్స్‌ పెరిగే అవకాశం ఉందని అంతా అనుకున్నారు.

యువ హీరోలు పలువురు జులై నెల నుండి కెమెరా ముందుకు వస్తామంటూ నిర్మాతలకు సూచించారు.ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఈ నెలలో కూడా షూటింగ్స్‌ ఆరంభం అయ్యేలా లేదు.

Advertisement

జీహెచ్‌ఎంసీలోనే ఎక్కువగా షూటింగ్స్‌ జరగాల్సి ఉంది.కాని కరోనా కేసుల సంఖ్య అక్కడే విపరీతంగా పెరుగుతున్నాయి.

గత రెండు మూడు రోజులుగా కేసులు వేలల్లో ఉంటున్న నేపథ్యంలో షూటింగ్స్‌కు వెళ్లక పోవడం మంచిది అనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

సినిమాకు చెందిన వారు షూటింగ్స్‌లో హాజరు కాకున్నా కూడా చాలా మంది వైరస్‌ బారిన పడుతున్నారు.సీరియల్స్‌ షూటింగ్స్‌ జరగడంతో పదుల సంఖ్యలో బుల్లి తెర వారు కరోనా బారిన పడ్డారు.అందుకే ఈ నెలలో షూటింగ్‌కు వెళ్లాలి అనుకున్న వారు ఆగిపోయారు.

కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ను ఆగస్టు 15 వరకు తీసుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.కనుక అప్పటి వరకు వెయిట్‌ చేయాల్సిందే అంటూ నిర్ణయించుకున్నారట.

జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?
Advertisement

తాజా వార్తలు