సినీ పరిశ్రమలో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, ఇలా సినీ పరిశ్రమ ఏదైనప్పటికీ తనకంటూ అభిమానులను సంపాదించుకున్నటువంటి హీరోల్లో సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకరు.అయితే సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వశక్తి జరిగినటువంటి రజినీకాంత్ సాయం కోరి ఎవరైనా తన వద్దకు వస్తే లేదనకుండా తోచినంత సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు.
తాజాగా రజినీకాంత్ దేశంలో మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న కారణంగా పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించిన విషయంపై స్పందించాడు.
అంతేగాక ఈ లాక్ డౌన్ కారణంగా అవస్థలు పడుతున్నటువంటి నిరు పేదలకు మరియు రోజువారి కూలీలకు సహాయం చేసేందుకు గాను దాదాపు 50 లక్షల రూపాయలు విరాళాన్ని ప్రకటించాడు.
దీంతో పలువురు సినీ ప్రముఖులు రజినీకాంత్ చేసినటువంటి ఈ పనిని ఎంతగానో అభినందిస్తున్నారు.అంతేకాక అతడు నటన పరంగానే కాకుండా రియల్ లైఫ్ సూపర్ స్టార్ హీరో అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
అయితే తమిళ సినిమా పరిశ్రమలో ఇప్పటికే స్టార్ హీరో బ్రదర్స్ కార్తీ మరియు సూర్య ఇద్దరు కలిసి 20 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు.అలాగే విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కూడా 10 లక్షల రూపాయలను ఇటీవలే ప్రకటించాడు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా టాలీవుడ్ లో కూడా యంగ్ హీరో నితిన్ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి చెరువు 10 లక్షల రూపాయల విరాళంగా ప్రకటించారు.అయితే తే తెలుగు పరిశ్రమ నుంచి ఇప్పటివరకు కేవలం నితిన్ మాత్రమే విరాళం ప్రకటించడం గమనార్హం.