ప్రస్తుత కాలంలో నూతన నటీనటులకు సోషల్ మీడియా మాధ్యమాలు బాగానే ఉపయోగపడుతున్నాయి.ఇందులో ముఖ్యంగా కొత్త తరం హీరోయిన్లు సోషల్ మీడియా ద్వారా పాపులర్ అవుతూ అవకాశాలను కూడా సంపాదిస్తున్నారు.
అయితే ఇటీవలే టాలీవుడ్ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి నటిస్తున్నటువంటి “రొమాంటిక్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నటువంటి హీరోయిన్ కేతిక శర్మ సోషల్ మీడియా మాధ్యమం అయినటువంటి ఇన్స్టాగ్రామ్ లో తన అందాల ఆరబోతతో రెచ్చిపోతోంది.
ఇందులో భాగంగా తన హాట్ హాట్ ఫోటోలను ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ తన అభిమానులకు అందాల విందు చేస్తోంది.
దీంతో ఒక్కసారిగా కేతిక శర్మ అందానికి ఫిదా అయినటువంటి నెటిజన్లు ఆమె అందంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.మరికొందరు మాత్రం ఆ మాత్రం లేకుంటే పూరి జగన్నాద్ తన కొడుకు చిత్రంలో నటించేందుకు హీరోయిన్ గా సెలెక్ట్ చేయడు కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే ప్రస్తుతం కేతిక శర్మ నటిస్తున్నటువంటి రొమాంటిక్ అనే చిత్రం ఇప్పటికే దాదాపుగా 50 శాతానికిపైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు అనిల్ పాడూరి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ చిత్రానికి టాలీవుడ్ హీరోయిన్ ఛార్మి కౌర్ నిర్మాత గా వ్యవహరిస్తోంది.అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.
ఈ చిత్రాన్ని మే నెలలో 29వ తారీఖున విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.అయితే ఈ అమ్మడు ఇటీవలే మరో టాలీవుడ్ చిత్రంలో కూడా అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.