ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి అందరికీ తెలిసిందే.ఈ వైరస్ సోక కుండా ఉండేందుకు అందరు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు నెత్తినోరు మొత్తుకుంటున్నారు.
చైనాలో ప్రారంభమైన ఈ వైరస్ వ్యాధి ఇప్పుడు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు వ్యాపించింది.దీంతో అన్ని దేశాల ప్రభుత్వాలు తగు నివారణ చర్యలు తీసుకుంటున్నాయి.
కాగా తెలంగాణ సర్కార్ ఈ కరోనా విషయంలో ఒక అడుగు ముందుకేసి హీరో విజయ్ దేవరకొండను బుక్ చేసింది.
అదేంటి.
విజయ్ దేవరకొండను బుక్ చేయడం ఏమిటి అనుకుంటున్నారా? కరోనా వైరస్ గురించిన అవగాహన కార్యక్రమాన్ని యాడ్ రూపంలో చేయడానికి టీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.అందుకే ఈ యాడ్‌లో టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో చేయించాలని ఫిక్స్ అయ్యింది.
అనుకున్నదే అనువుగా వారు ఈ మేరకు యాడ్ షూటింగ్ కూడా పూర్తి చేశారు.తాజాగా ఈ యాడ్‌ను అన్ని ప్రసార మాధ్యమాల్లో టెలికాస్ట్ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.
కాగా ఇప్పటికే భారత్‌లో 42కు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి.అయితే ఎలాంటి అపోహలను ప్రజలు నమ్మవద్దని టీ-సర్కార్ ఈ యాడ్ రూపంలో తెలపనుంది.