వివేకా కేసులో ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?

ఏపీ సీఎం జగన్‌ బాబాయి వైఎస్‌ వివేకనంద రెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఆయన కూతురు సునీత డిమాండ్‌ చేస్తూ హైకోర్టుకు వెళ్లిన విషయం తెల్సిందే.సునీత పలు అనుమానాలను వ్యక్తం చేస్తుంది.

 Latest Update News About Vivekanandha Reddy Murder Case-TeluguStop.com

వైకాపా నాయకులు ఎంపీలకు ఈ హత్యతో సంబంధం ఉన్నట్లుగా ఆమె అనుమానాలు వ్యక్తం చేస్తూ సీబీఐ విచారణకు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు.హైకోర్టులో ఏపీ ప్రభుత్వం తరపున వాదించిన లాయర్‌ సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదు అంటూ వాదిస్తున్నాడు.

వివేకనంద రెడ్డి హత్యకేసు నిమిత్తం నియమించిన సిట్‌ ఇప్పటికే విచారణ పూర్తి చేసింది.దోషులను గుర్తించి చట్టం ముందు నిలిపే ఈ సమయంలో మళ్లీ సీబీఐ విచారణ అంటే మళ్లీ మొదటి నుండి చేయాల్సి వస్తుందని, అందుకే సీబీఐ విచారణ అవసరం లేదు అంటూ వైకాపా ప్రభుత్వం వాదిస్తుంది.

వైకాపా ప్రభుత్వం తీరుపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఎందుకు వివేక హత్య కేసును ప్రభుత్వం పట్టించుకోకుండా సీబీఐకి అప్పగించకుండా అడ్డుకుంటుంది అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అసలు ఈ కేసు విషయమై ప్రభుత్వంకు ఉన్న భయం ఏంటీ అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube