రెండు మూడు రోజులుగా తెలుగుదేశం జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నాయనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోందది.జగన్ కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ బీజేపీ అగ్ర నేతలు అనుసరిస్తున్న వైకిరిపై కొద్ది రోజులుగా పవన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
బీజేపీ వైఖరితో విసుగు చెంది ఆ పార్టీతో తెగతెంపులు చేసుకుంటున్నారని, ఏపీలో తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు వెళ్లడం ద్వారా వచ్చే ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవాలని, ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.అయితే దీనిపై అటు టిడిపి నుంచి కానీ ఇటు జనసేనాని నుంచి కానీ ఎటువంటి స్పందన రాలేదు.
పవన్ బీజేపీతో పూర్తిగా తెగతెంపులు చేసుకున్న తర్వాత మాత్రమే ఈ విషయంపై స్పందించాలని చూస్తున్నట్లుగా ప్రచారం కూడా జరుగుతోంది.

అసలు టిడిపితో కలిసి పవన్ ముందుకు వెళ్తాడా అనేది చాలామందిలో ఉన్న అనుమానం.ఈ అనుమానాలను నివృత్తి చేసేలా తెలుగుదేశం జనసేన పార్టీ లు వ్యవహరిస్తున్నాయి.పొత్తు తప్పక పెట్టుకోబోతున్నారనే సంకేతాలను కలిగిస్తున్నాయి.
కొద్ది రోజులుగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు లక్ష్యంగా ఏపీలో ఐటీ దాడులు జరుగుతున్నాయి.ఈ దాడుల్లో భారీ మొత్తం దొరికిందని, అనేక కీలక ఆధారాలు లభించాయని, చంద్రబాబు పి ఎస్.శ్రీనివాస్ ఇంటివద్ద నిర్వహించిన ఐటీ సోదాల్లో కీలకమైన ఆధారాలు ఐటీశాఖ సంపాదించినట్లు ప్రచారం జరుగుతోంది.అయితే ఇందులో వాస్తవం ఉన్నా లేకపోయినా ఈ విషయం పై చంద్రబాబు మాత్రం స్పందించలేదు.
అసలు ఎవరికీ అందుబాటులో లేకుండా చంద్రబాబు హైదరాబాద్ లోనే ఉంటున్నారు.

ఈ విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించకపోవడం అనేక అనుమానాలు కలుగుతుంది.టిడిపి అధినేత జరుగుతున్న దాడుల విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దే తప్పన్నట్టుగా పవన్ మాట్లాడుతున్నారు.ఈ వ్యవహారాలను బట్టి చూస్తే పవన్ టిడిపి కి అనుకూలంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది.
బిజెపి ఎలాగు జగన్ ను చేరదీస్తున్నారు కాబట్టి ఏదో సమయంలో తాను బీజేపీకి దూరమైతే ఏపీలో తనకు అండగా ఉండేది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే అన్న ఆలోచనలో ఉన్నారు పవన్.అందుకే ఇప్పుడు టిడిపితో పొత్తు పెట్టుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు గా తెలుస్తోంది.
టీడీపీ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ అండ తమకు అవసరం అన్నట్టుగా పొత్తు కోసం వేచి చూస్తోంది.