మనిషిని పోలిన మనుషులు ఎక్కడో ఉండే ఉంటారు.కొన్ని సార్లు 80 శాతం 90 శాతం పోలికలు ఉన్న వారు కూడా తారస పడుతారు.
కవల పిల్లలు మాత్రమే కాకుండా కొన్ని సందర్బాల్లో వేరు వేరు ప్రాంతాలకు చెందిన వారు వేరు వేరు కుటుంబాలకు చెందిన వారు కూడా ఒకేలా ఉండటం మనం చూస్తూ ఉంటాం.కాని సెలబ్రెటీల్లా ఎవరైనా కనిపిస్తే వారిని తెగ వైరల్ చేసేస్తాం.
ఎంతో మంది సెలబ్రెటీలకు డూప్‌లు ఉన్నారు.ఇప్పటి వరకు వారిని చూసిన ఆశ్చర్య పోయాం.
ఈసారి సమంతను చూసిన వారు ఆశ్చర్యపోకుండా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

తమిళ హీరోయిన్ ఆత్మికను కొన్ని యాంగిల్స్‌లో చూస్తే సమంత కాదంటే అస్సలు నమ్మరు.నిజంగా ఒట్టు ఈమె సమంత కాదు అన్నా కూడా నమ్మలేనంత ఖచ్చితంగా అలాగే ఉంది.అద్బుతమైన ఫీచర్స్‌తో ఆత్మిక ప్రస్తుతం సమంతకు యమ డూప్‌లగా మారిపోయింది.
గతంలో అషు రెడ్డిని సమంతకు డూప్ అనుకునే వారు.కాని ఇప్పుడు ఆత్మిక గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.