అమెరికాలో భారత సంతతి యువతి అరుదైన ఘనత సాధించారు.23 ఏళ్ల ఇండియన్- అమెరికన్ విద్యార్ధిని, మిస్ వరల్డ్ అమెరికా వాషింగ్టన్ శ్రీ సైనీ ప్రపంచ శాంతి అవార్డును అందుకున్నారు.దీనిపై స్పందించిన ఆమె ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నందుకు సంతోషంగా, గౌరవంగా ఉందన్నారు.ఇది దేవుని ఆశీర్వాదంతో పాటు ప్రతిక్షణం తనను వెన్నంటి వుండి ప్రొత్సహించిన తన తల్లిదండ్రులు వల్లే తనకు అంతర్జాతీయ గుర్తింపు, ఈ విజయాలు లభించాయని సైనీ అన్నారు.
ప్రతి సంవత్సరం పాషన్ విస్టా.సమాజ శ్రేయస్సు కోసం కృషి చేసిన వివిధ వర్గాల ప్రజలను సత్కరిస్తుంది.
శ్రీ సైనీ యూనివర్సిటీ ఆప్ వాషింగ్టన్ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బిజినెస్‌లలో డబుల్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు.ఈమె గతంలో జరిగిన అనేక పోటీలలో పాల్గొని విజయం సాధించారు.2018లో మిస్ ఇండియా వరల్డ్ వైడ్ కిరీటం పొందారు.అలాగే 2019 మిస్ వరల్డ్ అమెరికా పోటీలకు ఎంపికయ్యారు.
యేల్ యాక్టర్స్ కన్జర్వేటరీ నుంచి శ్రీ సైనీ నటనలో శిక్షణ సైతం పొందారు.

భారత్‌లోని పంజాబ్‌కు చెందిన ఈమె ఏడేళ్ల వయసులో వాషింగ్టన్‌కు వెళ్లింది.ఉన్నత పాఠశాలలో ఉండగా వర్ణానికి సంబంధించిన వేధింపులు ఎదుర్కోవడంతో, తన అనుభవాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి www.shreesaini.org వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది.శ్రీ సైనీ 12 సంవత్సరాల వయస్సులో ముఖంపై కాలిన గాయాలు, గుండె సంబంధిత శస్త్రచికిత్స నుంచి బయటపడ్డారు.స్టాన్‌ఫోర్డ్ వర్సిటీలో ఎమోషనల్ హీత్‌పై యాప్‌ను రూపొందించారు.ఎమోషనల్ ఫిట్‌నెస్‌పై ఆరు దేశాల్లోని, 80 నగరాల్లో వందలాది ప్రజంటేషన్లు ఇవ్వడంతో పాటు పలు వార్తపత్రికల్లో 400 వ్యాసాలను సైనీ రాశారు.