యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్నాడు.దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు.
కాగా ఈ సినిమా తరువాత తారక్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ కావడంతో మరోసారి ఈ కాంబో రిపీట్ కానుంది.
అయితే ఈ కాంబినేషన్లో సినిమా ఆర్ఆర్ఆర్ తరువాతే వస్తుందని అందరూ ఫిక్స్ అయ్యారు.కానీ ఆర్ఆర్ఆర్ రిలీజ్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేయడంతో, తారక్ తన నెక్ట్స్ మూవీని రెడీ చేసే పనిలో పడ్డాడు.
కాగా త్రివిక్రమ్ కంటే ముందే తారక్ మరో సినిమాను రెడీ చేసే పనిలో పడ్డాడట.తమిళంలో అసురన్ వంటి బ్లాక్‌బస్టర్ మూవీని అందించిన డైరెక్టర్ వెట్రిమారన్‌తో తారక్ ఓ సినిమా చేస్తాడనే వార్త ఇండస్ట్రీ వర్గా్ల్లో వినిపిస్తోంది.
తాజాగా వెట్రిమారన్ తారక్‌కు ఓ కథను వినిపించగా, స్క్రిప్టును పూర్తి చేయాల్సిందిగా తారక్ కోరాడట.దీంతో వెట్రిమారన్ అదే పనిలో ఉన్నాడు.
ఇక త్రివిక్రమ్ కూడా తారక్ కోసం అదిరిపోయే కథను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.మరి తారక్ ముందుగా ఎవరితో సినిమా చేస్తాడనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.