తాజాగా బాలీవుడ్ విలక్షణ నటి కంగనా రనౌత్ నటించినటువంటి చిత్రం పంగా.ఈ చిత్రానికి దర్శకురాలు అశ్వినీ అయ్యర్ తివారీ దర్శకత్వం వహించగా ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంస్థ నిర్మించారు.
అయితే తాజాగా ఈ చిత్రంలో నటించినటువంటి పలువురు నటీనటులు కలిసి ది కపిల్ శర్మ షో లో పాల్గొన్నారు.
అయితే వీరిలో పంగా సినిమాలో కంగనా రనౌత్ కి తల్లి పాత్రలో నటించినటువంటి నీనా గుప్త కూడా ఉన్నారు.
అయితే నీనా గుప్తా ప్రముఖ నటి పమేలా అండర్సన్ పై చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.వ్యాఖ్యాత కపిల్ శర్మ మంచి విజయం సాధించినటువంటి బేవాచ్ అనే హాలీవుడ్ చిత్రాన్ని హిందీలో రీమేక్ లో మీరు పమేలా అండర్సన్ పాత్రలో నటిస్తున్నట్లు పలు వార్తలు వినిపిస్తున్నాయి.
నిజమేనా అని అడిగాడు.దీంతో నీనా గుప్తా సమాధానం చెబుతూ నాకు పమేలా అండర్సన్ కి ఉన్నంత ఛాతి లేదని, లేని దాన్ని ఎక్కడి నుంచి తీసుకు రావాలని అన్నారు.
ఈ సమాధానం ఉన్నటువంటి పలువురు ఒక్కసారిగా ఖంగు తిన్నారు.అయితే ఈ షోలో 12 సంవత్సరాలు కలిగినటువంటి బాలుడు కూడా ఉన్నాడు.

దీంతో ప్రస్తుతం ఈ విషయాన్ని నెట్లో నెటిజన్లు బాగానే ట్రోల్ చేస్తున్నారు.చిన్న పిల్లలు ముందు ఇలాంటి నాన్ వెజ్ జోక్స్ పేల్చడం సరి కాదని, అంతేకాక ఇలాంటి విషయాల వల్ల పిల్లల భవిష్యత్తు పాడైపోతుందని కామెంట్ చేస్తున్నారు.అయితే కపిల్ శర్మ షోలో ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాదు.గతంలో కొద పలువురు సెలెబ్రెటీలు నోరు జారీ కొందరు, కావాలనే ఇతరులపై అనుచిత వ్యాఖ్యలు చేయి మరి కొందరు వివాదాల పాలయ్యారు.