నిర్భయ దోషులకు ఉరి శిక్ష పడి నెలలు గడుస్తున్నా కూడా శిక్ష అమలుకు మాత్రం ఏదో ఒక అడ్డు వస్తుంది.దోషులు కాస్త తెలివిగా ఒకరి తర్వాత ఒకరు క్షమాభిక్ష పిటీషన్ పెట్టుకోవడం లేదంటే కోర్టుకు వెళ్లడం వంటివి చేస్తున్నారు.
దాంతో ఒక్కరి వల్ల అందరికి ఉరి శిక్ష వాయిదా పడుతుంది.ఒకే కేసులో శిక్ష పడ్డ వారికి అందరికి ఒకేసారి ఉరి వేయాలనే నిబంధన ఉన్న కారణంతో వారు ఉరిని గత కొన్ని వారాలుగా పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు.
తెల్లారితో నిర్బయ దోషులకు ఉరి అంటూ అంతా ఎదురు చూస్తున్న సమయంలో రాత్రికి రాత్రే ఉరి శిక్షపై స్టే విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.అయితే కేంద్రం ఆ స్టేను తొలగించాలని, వారిని ఉరి తీసేందుకు అనుమతించాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
అయితే కేంద్రం పెట్టుకున్న పిటీషన్‌ను సుప్రీం కొట్టి వేసింది.వారు చట్టపరంగా అన్ని అంశాలను వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత న్యాయస్థానంకు ఉందని కోర్టు పేర్కొంది.
వారం రోజుల్లో వారు న్యాయపరమైన అంశాలను ఉపయోగించుకోవాలని సుప్రీం టైం ఇచ్చింది.ఆ గడువు తర్వాత అయినా సుప్రీం వారికి ఉరి శిక్ష వేయనిస్తుందా చూడాలి.
వారి ఉరి కోసం దేశమే ఎదురు చూస్తుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.