మొన్నటి వరకు హెల్మెట్ పెట్టుకోవాలంటే బైక్ తోలేవారు బద్దకించేవారు.కాని ఇప్పుడు వందలకు వందలు ఫైన్స్ పడుతుండటంతో బయటకు వెళ్లేప్పుడు తప్పనిసరిగా బద్దకం మానేసి ఖచ్చితంగా హెల్మెట్ ధరిస్తున్నారు.
కాని ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే బండి వెనుక కూర్చున్న వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి రాబోతుంది.మొదట సింగిల్ హెల్మెట్‌పై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం అది కాస్త సఫలం అవ్వడంతో ఇక డబుల్ హెల్మెట్‌పై యుద్దంకు సిద్దం అయ్యింది.
యాక్సిడెంట్ అయితే ముందు కూర్చున్న వారికి మాత్రమే కాకుండా వెనుక వారికి కూడా ప్రాణాపాయమే.అందుకే వెనుక ఉన్న వారికి కూడా సేఫ్టీ అవసరం.అందుకే రెండు హెల్మెట్లు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.అయితే అది ఇంకా అమలు కావడం లేదని కొందరు అనుకుంటున్నారు.
కాని విషయం ఏంటీ అంటే కొన్ని ఏరియాల్లో ఇప్పటికే రెండు హెల్మెట్లను వినియోగించాలంటూ ప్రచారం చేయడంతో పాటు రెండవ వ్యక్తి హెల్మెట్ పెట్టుకోకుంటే వంద రూపాయల చలాన్ రాస్తున్నారు.ఇది ఆరంభం మాత్రమే ఈ ఏడాది చివరకు వరకు దీన్ని కఠినంగా అమలు చేయబోతున్నట్లుగా చెబుతున్నారు.
మరెందుకు ఆలస్యం వెంటనే మీరు రెండవ హెల్మెట్ కొనుగోలు చేయండి.