మరోసారి డబుల్ ట్రీట్ అంటోన్న రవితేజ

మాస్ రాజా రవితేజ తాజాగా నటించిన డిస్కో రాజా చిత్రం ఇటీవల రిలీజ్ అయ్యి మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకుంది.ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

 Raviteja To Do Dual Role In His Next Movie-TeluguStop.com

కానీ సినిమాలో అంత మ్యాటర్ లేకపోవడంతో ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించలేదు.దీంతో కలెక్షన్ల పరంగా డిస్కో రాజా చిత్రం నిరాశ పరిచిందనే చెప్పాలి.

ఇక రవితేజ తన నెక్ట్స్ మూవీ క్రాక్‌పై ఫుల్ ఫోకస్ పెట్టాడు.

గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడు.

ఈ సినిమా తరువాత రవితేజ తన నెక్ట్స్ మూవీని కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది.మాస్‌రాజాకు వీర వంటి సినిమాను అందించిన రమేష్ వర్మ డైరెక్షన్‌లో రవితేజ ఈ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో రవితేజ డ్యుయెల్ రోల్‌లో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ఈ సినిమా షూటింగ్‌ను వేసవిలో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

ఇక ఈ సినిమాను కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నాడు.ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అటు క్రాక్ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు రవితేజ రెడీ అవుతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube