ఆదర్శం : నాయకులంతా ఇలాంటివారైతే మన దేశం ఎప్పుడో అమెరికాను క్రాస్‌ చేసేదేమో

ఈమద్య కాలంలో సర్పంచ్‌ అయితేనే లక్షలు కోట్లు సంపాదించుకుంటున్నారు.రాజకీయం అంటేనే సంపాదన కోసం వస్తున్నారు.

 Interesting Facts About Yellandu Mla Gummadi Narsaiah-TeluguStop.com

ఇలాంటి కాలంలో ఎమ్మెల్యేగా చేసి ఏమీ సంపాదించుకోని వ్యక్తిని మీకు చూపిస్తే ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడతారు కదా.నిజమా అంటూ ప్రశ్నిస్తారు కదా… అసలు అలాంటి వ్యక్తులు ఉంటారా అంటూ అనుమానం వ్యక్తం చేస్తారు.కాని ఎమ్మెల్యేగా చేసి ప్రస్తుతం ఒక సామాన్యమైన వ్యక్తిగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న వ్యక్తి ఉన్నాడు.ఆయనే మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య.

Telugu Gummadisaiah, Yellandumla-General-Telugu

ఈయన గురించి సోషల్‌ మీడియాను ఫాలో అయ్యే వారికి బాగానే తెలిసి ఉంటుంది.అయితే ఆయన గురించి అంతా ఎవరికి తెలియదు.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి.ఆయన ఒక గొప్ప ప్రజా సేవకుడు.ఎమ్మెల్యే అంటే లక్షలు కోట్లు సంపాదించుకునే వీలు ఉంటుంది.అప్పట్లో ఇంతగా లంచాలు ఎక్కడివి అనుకుంటున్నారేమో.ఈయన ఎప్పుడో స్వాతంత్య్రం వచ్చినప్పుడు కాదు ఎమ్మెల్యేగా చేసింది.2004లో అంటే రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో కూడా ఎమ్మెల్యేగా చేశాడు.

Telugu Gummadisaiah, Yellandumla-General-Telugu

ఎమ్మెల్యేగా ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గంకు ప్రాతినిధ్యం వహించిన నర్సయ్య గారు ప్రస్తుతం కడు పేదరికంను అనుభవిస్తున్నారు.ఎమ్మెల్యేగా చేసినందుకు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్‌ డబ్బులతో జీవితం సాగిస్తున్నాడు.ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్యాహ్న బోజన సెంటర్‌లలో ఈయన భోజనం చేస్తూ ఉంటారు.ఆర్టీసీ బస్సు ఎక్కి ఒక సామాన్య ప్రయాణికుడి మాదిరిగా ప్రయాణం చేస్తూ ఉంటారు.

ఈయనకు ఒక చిన్న ఇల్లు తప్ప ఎలాంటి ఆస్తులు కూడా లేవు.

ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్లే నాయకులు పూర్తిగా డబ్బు ఆశతోనే వెళ్తున్నారు.

డబ్బు ఉన్న వారు మాత్రమే రాజకీయాలు చేయగలుగుతున్నారు.డబ్బు సంపాదించిన వారు ఆ డబ్బును మరింత పెంచుకునేందుకు మాత్రమే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ప్రతి రాజకీయ నాయకుడు ఇలా అని కాదు కాని ఎక్కువ శాతం ఇలాగే ఉన్నారు.అయితే ఏ ఒక్కరు కూడా నర్సయ్య గారిలా మాత్రం రాజకీయాలు చేయరు, చేయలేరు అని చెప్పగలము.

మన దేశంలోని ప్రతి రాజకీయ నాయకుడు కూడా గుమ్మడి నర్సయ్య గారిలా రాజకీయాలు చేస్తే మన దేశం ఎప్పుడో అమెరికా అంతటి అగ్ర దేశంగా మారిపోయేది.స్విస్‌ బ్యాంక్‌లలో లక్షల కోట్ల డబ్బులు పడి ఉండేది కాదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube