ఇండియాలో ఇప్పటికి చాలా ప్రాంతాల్లో పిల్లలకు జ్వరం వచ్చినా లేదంటే ఇంట్లో ఎవరికైనా బాగా లేకున్నా కూడా స్వామీజీల వద్దకు వెళ్లడం కామన్‌గా చూస్తూనే ఉంటాం.ముఖ్యంగా పల్లెటూర్లలో పిల్లలు మరియు పెద్ద వారి మెడలో కూడా తాయెత్తులు కనిపిస్తూ ఉంటాయి.
ఇటీవల ఒక ఎమ్మెల్యే తాను ఎన్నికల్లో గెలిచేందుకు ఒక స్వామీజీ వద్ద తాయెత్తు తీసుకున్నాడట.ఆ తాయెత్తు కట్టుకోవడం వల్లే ఆయన గెలిచాడు అంటూ ఆ స్వామీజీ చెబుతున్నాడు.
మంత్రాలతో, తాయెత్తులతో రోగాలను నయం చేస్తామని చాలా మంది తాంత్రికులు, స్వామీజీలు అంటూ ఉంటారు.ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నుండి ఒక మంత్రంతో కాపాడుతాను అంటూ ప్రముఖ ఆద్యాత్మిక గురువు దలైలామా అంటున్నారు.
ప్రపంచ ప్రసిద్ది గాంచిన ఆధ్యాత్మిక గురువుగా పేరు దక్కించుకున్న దలైలామాను చాలా మంది నెటిజన్స్ కరోన వైరస్ నుండి కాపాడమంటూ వేడుకుంటున్నారు.లక్షలాది మంది ఆయనే దీనికి పరిష్కారం చూపించగలడు అంటూ భావిస్తున్నారు.చైనాలోని లక్షలాది మంది కూడా దలైలామాను దేవుడిగా పూజిస్తారు.వారంతా ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నారు.వారిని కాపాడేందుకు దలైలామా ఒక మంత్రంను చెబుతున్నారు.
తనను వేడుకుంటున్న వారిని ఆదుకునేందుకు తారా మంత్రంను దలైలామా చెబుతున్నాడు.ఎవరైతే తారా మంత్రంను జపిస్తారో వారికి కరోనా వైరస్ అంటదు అంటున్నారు.కరోనా వైరస్ నుండి కాపాడుకునేందుకు ఓం తారే తుత్తారే సోహా అనే మంత్రాన్ని జపించాలంటూ స్వయంగా దలైలామా ఆ మంత్రాన్ని జపించి జనాలకు వినిపించారు.
దాంతో ప్రస్తుతం ఈ మంత్రం చైనా మొత్తం మారు మ్రోగిపోతుందట.చైనా మీడియాలో కూడా ఈ మంత్రంకు సంబంధించిన వార్తలు ప్రముఖంగా వస్తున్నాయి.దలైలామాను నమ్మిన వారు, ఇన్నాళ్లు నమ్మని వారు అంతా కూడా తారా మంత్రంను జపిస్తు కనిపిస్తున్నారట.ఇదే సమయంలో కరోనాకు మందు కనిపెట్టినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.
మరి తారా మంత్రం వల్ల మందు కనిపెట్టారా లేదంటే… మీరే చెప్పాలి.