టాలీవుడ్‌లో భారీ సినిమాలకు తెరలేపిన దర్శకుడిగా గుణశేఖర్ తనదైన ముద్రవేసుకున్నాడు.హిస్టారికల్ సినిమాలను తనదైన శైలిలో తెరకెక్కించి విజయాలను అందుకోవడంలో ఈ దర్శకుడు సక్సెస్ సాధించాడు.
కాగా ఈయన ఎప్పటినుండో తెరకెక్కించాలని చూస్తున్న ‘హిరణ్యకశిప’ చిత్రం వాయిదా పడుతూనే వస్తోంది.ఈ సినిమాను రానా దగ్గుబాటితో కలిసి తెరకెక్కించేందుకు గుణశేఖర్ గతంలోనే రెడీ అయ్యాడు.
అయితే సినిమా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు.రానా అనారోగ్య కారణాల వల్ల హిరణ్యకశిప షూటింగ్‌ను మొదలుపెట్టలేదని అందరికీ తెలిసిందే.
కాగా ఆ సమయంలో రానా అమెరికాలోని ఓ ప్రముఖ వీఎఫ్ఎక్స్ స్టూడియోలో హిరణ్యకశిపకు సంబంధించిన పనుల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.అయితే ఇప్పుడు విరాటపర్వం అనే సినిమాలో నటిస్తున్న రానా, ఆ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా ముగించేసుకుని హిరణ్యకశిపుడిగా మారేందుకు రెడీ అవుతున్నాడు.
ఇక చిత్రపురి సమాచారం ప్రకారం వేసవిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడం ఖాయమని తెలుస్తోంది.సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు ఈ సినిమాను రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు.మరి తన డ్రీమ్ ప్రాజెక్ట్‌తో గుణశేఖర్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.