కొత్త ప'రేషాన్' : కరెంటు బిల్లుతో పథకాలకు లింక్

ఏపీలో ఎన్నో సంచలనాత్మక పథకాలు ప్రవేశపెట్టి జగన్ ప్రభుత్వం ప్రజల్లోకి అతి తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించుకుంది.అసలు సాధ్యమే కాదు అనుకున్న పథకాలను కూడా జగన్ ప్రవేశపెట్టి జగన్ తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు.

 Link To Government Schemes With Current Bill-TeluguStop.com

అయితే ఇప్పుడు మరో సంచలనాత్మకమైన నిర్ణయానికి జగన్ ప్రభుత్వం సిద్దమయ్యింది.అయితే అది ప్రజలకు షాక్ ఇచ్చేది.పెన్షన్, రేషన్ కార్డులలో కోత పెట్టేందుకు, కొత్త వాటిని మంజూరు చేసేందుకు కరెంట్ బిల్లులతో లింకు పెట్టడంతో పెన్షన్ దారులు, రేషన్ కార్డుదారులలో ఆందోళన మొదలైంది.

200 యూనిట్లు దాటితే రేషన్, 300 యూనిట్లు దాటితే పెన్షన్ కట్ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఈ వివరాలను ఎప్పటికప్పుడు గ్రామ వాలంటీర్లు పరిశీలిస్తూ ఉంటారు.భార్యాభర్తలు ఇద్దరు పేరు మీద ఉన్న ఆధార్ కార్డుతో అనుసంధానం అయి అన్ని సర్వీసులను కలిపి ఒక యూనిట్ గా గృహ, వాణిజ్య వ్యాపార పారిశ్రామిక సర్వీస్ లు కలిపి ఒక యూనిట్ గా అధికారులు పరిగణించబోతున్నారు.

కొత్తగా పెట్టిన నిబంధనల ప్రకారం పారిశ్రామిక సర్వీసులు అన్నిటిని కలిపి ఒక యూనిట్ గా చూస్తారు.ఈ నిబంధనల ప్రకారం రోడ్డు పక్కన ఉంటున్న వారిని ఈ జాబితాలో చేర్చారు.

దీని ద్వారా విద్యుత్ సంస్థలు సర్వీసులు మంజూరు చేస్తాయి.తమ ఇల్లు వేరే వాళ్ళకి అద్దెకు ఇచ్చి పొరుగూరు లో ఉంటున్న వారికి కొత్త నిబంధనల ప్రకారం ఇబ్బందులు తప్పవని విద్యుత్ అధికారులు చెబుతున్నారు.

సొంత ఇల్లు అద్దెకు ఇచ్చే స్థాయిలో ఉన్నప్పుడు వారికి ప్రభుత్వ పథకాలు ఎందుకని ప్రభుత్వం భావిస్తోంది.అయితే దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube