పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి తర్వాత సినిమాలకు దూరం అయ్యి రాజకీయంగా బిజీ అయ్యాడు.ఆయన సినిమాలు చేయకపోవచ్చు అని అంతా అనుకున్నారు.
కాని మొన్నటి ఎన్నికల్లో జనసేన పార్టీ ఓటమిపాలయ్యింది.కనీసం పవన్ కూడా ఎమ్మెల్యేగా గెలవలేక పోయాడు.
దాంతో చేసేది లేక మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు పవన్ సిద్దం అయ్యాడు.పవన్ ప్రస్తుతం రాజకీయంగా ఎక్కువగా బిజీగా లేడు.
కనుక సినిమాలు చేయడం వల్ల రెండు విధాలుగా మంచి జరుగుతుందని ఆయన భావిస్తున్నాడు.

సినిమాల వల్ల పారితోషికం రూపంలో డబ్బులు వచ్చి ఆర్ధికంగా కాస్త వెసులు బాటు ఉంటుంది.అలాగే ఫ్యాన్స్‌లో క్రేజ్ కంటిన్యూ అవుతుంది.అందుకే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీకి సిద్దం అయ్యాడు.
బాలీవుడ్ హిట్ మూవీ ‘పింక్’ రీమేక్‌లో పవన్ కళ్యాణ్ నటించబోతున్నాడు.దిల్‌రాజు ఈ సినిమాను నిర్మించబోతున్నాడు.
శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది.భారీ అంచనాలున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభం అయినట్లుగా దిల్‌రాజు ప్రకటించాడు.
దిల్‌రాజు టీం అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో అసలు ఈ రీమేక్‌లో పవన్ నటిస్తున్నాడు అనే ప్రస్థావన లేదు.అది పవన్ సినిమా అనే విషయాన్ని కూడా వారు ప్రస్థావించలేదు.
దాంతో కొందరు అసలు ఈ రీమేక్ పవన్‌తో చేయబోతున్నాడా లేదంటే మరెవ్వరితో అయినా చేయబోతున్నాడా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.పవన్ ఆ విషయాన్ని రివీల్ చేయాలనే ఉద్దేశ్యంతో దిల్‌రాజు ఆ విషయాన్ని వెళ్లడించలేదేమో.