సలహాదారుల సలహాలు ఎన్ని ? ఇంతమంది అవసరమా ?

అసలు కంటే కొసరు ఎక్కువ అన్నట్టుగా తయారయింది ఏపీ అధికార పార్టీ.ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడం, ప్రజా సంక్షేమ పథకాలకు నిధులన్నీ మళ్లించడంతో ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది.

 Ycp Governament Post In 19 Advisors-TeluguStop.com

ఇదే సమయంలో కేంద్రం నుంచి సరైన ఆర్థిక సహకారం కూడా అందడం లేదు.ఇన్ని సమస్యలతో ఉండడంతో ప్రతి విషయంలోనూ పొదుపు పాటించాల్సిందిగా అధికారులు, మంత్రులు ఎమ్మెల్యేలకు సూచనలు చేస్తూ వస్తోంది.

అయితే మంత్రి మండలి సభ్యులు సంఖ్యకు దరిదాపుల్లోకి సలహాదారులను ప్రభుత్వం నియమించుకోవడంపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.వైసీపీ ప్రభుత్వానికి ప్రస్తుతం 19 మంది సలహాదారులు ఉండగా వారిలో పది మందికి క్యాబినెట్ హోదా ఉంది.

ఒక్కొక్కరి జీతభత్యాల కింద మూడు లక్షల నుంచి మూడున్నర లక్షల వరకు చెల్లిస్తున్నారు.అయితే వారు ప్రభుత్వానికి ఎటువంటి సలహాలు ఇస్తున్నారు ? ఆ సలహాలను ప్రభుత్వం పాటిస్తుందా లేదా అనే లెక్కలు బయటకు వస్తున్నాయి.

Telugu Apcm, Ap Ycp, Jagan Ministers, Ycp, Ycp Advisors-

టిడిపి ప్రభుత్వంలో ఆరుగురు సలహాదారులు ఉండగా వీరిలో నలుగురు మాత్రమే క్యాబినెట్ హోదా ఉండేది.ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తులు కూడా సలహాదారులుగా నియమించబడ్డారు.అయితే వీరందరి సలహాలు సూచనలు పాటించాల్సిన పరిస్థితుల్లో జగన్ లేడు.అయినా వీరి నియామకం చేపట్టడానికి ప్రధాన కారణం రాజకీయ పునరావాసం కోసం అన్నట్టుగా విమర్శలు సైతం వస్తున్నాయి.

ఇక ఈ సలహాదారులు అందరూ కూర్చోడానికి సచివాలయంలో ప్రత్యేక కేటాయింపులు ఏవీ లేవు.ఈ పరిస్థితుల్లో ఈ సలహాదారుల అంతా ఎక్కడ కూర్చుని సలహా ఇస్తున్నారు ? అసలు సలహాలు ఇచ్చే ఆలోచనలో ఉన్నారా లేదా అనే విషయం హైలెట్ అవుతోంది.మీడియా సలహాదారుగా ముగ్గురు ఉండగా, పరిశ్రమల శాఖకు ముగ్గురు సలహాదారులు ఉన్నారు.

అలాగే ఐటీ శాఖకు ఇద్దరు సలహాదారులు, ఆర్థిక శాఖకు ఒక సలహాదారు ఉన్నారు.

ప్రజా అవసరాల కోసం ఒక సలహాదారుడిని, ప్రజా విధానాల కోసం ఒకరిని, గల్ఫ్ దేశాలతో ఏపీ పారిశ్రామిక సంబంధాల కోసం ఒకరిని సలహాదారుని ప్రభుత్వం నియమించుకుంది.కానీ ఈ సలహాదారుల ఉపయోగం కానీ, అవసరం కానీ జగన్ కు ఇప్పటి వరకు అవసరం పడలేదనేది బహిరంగ రహస్యం.

వీరే సలహాదారులు

కేబినెట్‌ ర్యాంకుతో అజేయ కల్లాం: ప్రభుత్వ ముఖ్య సలహాదారు కె.రామచంద్రమూర్తి: ప్రజా విధానాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి: ప్రజావ్యవహారాల సలహాదారు జుల్ఫీ రావ్జీ: గల్ఫ్‌ దేశాలకు ప్రత్యేక ప్రతినిధి సాగి దుర్గాప్రసాదరాజు: సమన్వయ సలహాదారు తలశిల రఘురాం: కార్యక్రమాల కోఆర్డినేటర్‌ జీవీడీ కృష్ణమోహన్‌: కమ్యూనికేషన్‌ సలహాదారు దేవులపల్లి అమర్‌: జాతీయ మీడియా సలహాదారు పీటర్‌ హసన్‌: పరిశ్రమలకు ప్రోత్సాహం, ఎక్స్‌టర్నల్‌ వ్యవహారాలు ఎం.శామ్యూల్‌: నవరత్నాల సలహాదారు

కేబినెట్‌ ర్యాంక్‌ లేని వారు

వెంకట్‌ ఎస్‌.మేడపాటి: ఏపీఎన్‌ఆర్‌టీ తుమ్మల లోకేశ్వర్‌ రెడ్డి: టెక్నికల్‌ ప్రాజెక్టులు విద్యాసాగర్‌ రెడ్డి: ఐటీ టెక్నికల్‌ సలహాదారు లంకా శ్రీధర్‌: మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల ప్రోత్సాహక విభాగం విజయ్‌కుమార్‌: అగ్రికల్చర్‌ అండ్‌ కోఆపరేషన్‌ కృష్ణా జీవీ గిరి: పరిశ్రమలను ప్రోత్సహించే సలహాదారు వెంకట రమణి భాస్కర్‌: ఆర్థికం, వనరులు శిల్పా చేకుపల్లి: హెల్త్‌ సలహాదారు, న్యూఢిల్లీ ఎ.మురళి: పాఠశాల విద్య సలహాదారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube