జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వేదికగా మరోసారి తన మాటలకు పదును పెట్టాడు.ఏపీ సీఎం జగన్ ను టార్గెట్ చేసుకుంటూ కొంతకాలంగా వరుసగా పవన్ ట్విట్లు చేస్తూ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారాడు.తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై పవన్ ఘాటుగా స్పందించారు.
”ఇంగ్లీష్ భాషను వద్దని ఎవరూ చెప్పడం లేదు.కానీ తెలుగును మృతభాషగా కాకుండా ఏమి చర్యలు తీసుకుంటారో వైసీపీ నాయకుడు జగన్ రెడ్డి గారు చెప్పాలి.మాతృ భాషని, మాండలికాలను సంరక్షించే బాధ్యత ప్రభుత్వానిదే.మాతృభాషని మృతభాషగా మార్చకండి తెలుగు రాష్ట్రాన్ని ఏలుతూ, తెలుగు పేపర్ నడుపుతూ, తెలుగు భాషను చంపేసే ఆలోచన భస్మాసుర తత్వాన్ని చూపిస్తుంది జగన్ రెడ్డి గారు.మా తెలుగు తల్లి అని పాడాల్సిన మీరు తెలుగు భాష చంపేస్తున్నారు జగన్ రెడ్డి గారు అంటూ వరుసగా ట్విట్లు చేసి సంచలనం రేపారు పవన్.