ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు హీటెక్కుతున్నాయి.ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది నియోజిక వర్గాల వారీగా పట్టుకోసం ప్రధాన పార్టీలు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి.
ఈసారి ఉత్తరాంధ్రపై మూడు ప్రధాన పార్టీలుగా గట్టిగా ఫోకస్ చేస్తున్నాయి.ఎందుకంటే గెలుపోటముల విషయంలో ఉత్తరాంధ్ర ఓటు బ్యాంకు అత్యంతా కీలకం అయినందున అధికార వైసీపీతో పాటు టీడీపీ, జనసేన పార్టీలు కూడా ఇక్కడి ప్రజలను ఆకర్షించడమే ప్రధాన విధిగా ఉన్నాయి.
అయితే ఉత్తరాంధ్ర ప్రజలను ఆకర్శించేందుకు అధికార వైసీపీ( YCP ) ఒక్క అడుగు ముందే ఉంది.విశాఖను( Vizag ) కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించి ఇక్కడి ప్రజలను వైసీపీ గుప్పిట్లో ఉంచుకోవాలని వైఎస్ జగన్ గట్టిగానే ప్లాన్ చేశారు.

అయితే విశాఖ రాజధాని ఏర్పాటు పై ఇంతవరకు ఎలాంటి ముందడుగు పడకపోగా విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.దీంతో విశాఖ రాజధాని అంశం కాస్త వైసీపీకి తలపోటుగా మారింది.ఇదిలా ఉంచితే విశాఖలో పార్టీ పరంగా కూడా అనిశ్చితి వైసీపీని కలవర పెడుతోంది.గత కొన్నాళ్లుగా విశాఖ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు( Panchakarla Ramesh Babu ) అసంతృప్తిగా ఉంటూ వచ్చారు.
పార్టీ కార్యకలాపాలను కూడా పెద్దగా నిర్వహించడం లేదు.ఇదే టైమ్ లో అటు టీడీపీ గాని, ఇటు జనసేన గాని విశాఖలో పట్టుకోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాయి.దీంతో వైసీపీ హవా జిల్లాలో మెల్లగా తగ్గుతూ వస్తోందనేది పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.

ఇక తాజాగా పార్టీకి షాక్ ఇస్తూ పంచకర్ల రమేశ్ బాబు జిల్లా అధ్యక్ష పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి వైసీపీకి కోలుకోలేని షాక్ ఇచ్చారు.పార్టీలో సరైన గౌరవం దక్కడం లేదని అందుకే తాను రాజీనామా చేస్తున్నాట్లు ప్రకటించాడు రమేశ్ బాబు.ఈయన నెక్స్ట్ ఏ పార్టీలో చేరతారనే దానిపై ఎలాంటి క్లారిటీ లేనప్పటికి.
రమేశ్ బాబు దూరం కావడం వైసీపీకి గట్టి దెబ్బే అని విశ్లేషకులు చెబుతున్నారు.ఇప్పటికే విశాఖ కేంద్రంగా రాజధాని అంశంతో కుదేలవుతున్న వైసీపీకి రమేశ్ బాబు దూరం కావడం ములిగే నక్క మీద తాటి కాయ పడినట్లైంది.
మరి జిల్లాలో నెలకొన్న ఈ అనిశ్చితిని తొలగించేందుకు జగన్ ఎలాంటి వ్యూహాలు రచిస్తాడు.? నెక్స్ట్ ఎవరిని జిల్లా అధ్యక్షుడిగా నియమించనున్నారు అనేది చూడాలి.







