ఆయన వ్యూహం పన్నితే ఎటువంటి ప్రత్యర్థులైనా ఓడిపోవాల్సిందే.ఎలాంటి ఆశలు లేని చోట కూడా తన వ్యూహాలతో అవకాశాలు సృష్టించుకోగల రాజకీయ చతురత ఆయనది.
అలాంటి రాజకీయ చాణక్యుడికి నేడు గడ్డు కాలం నడుస్తోంది.ఇప్పటికే ఆయన ఎవరో మీకు గుర్తు వచ్చి ఉంటుంది.
అవునండి చంద్రబాబు నాయుడి గురించే.ఇప్పుడు ఏపీలో టీడీపీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అందరికీ కనిపిస్తూనే ఉంది.
రాబోయే ఎన్నికల్లో గెలుపు ఏమోగానీ కనీసం పోటీ ఇచ్చి పరువు నిలుపుకోవాలనే స్థితిలో టీడీపీ ఉంది.
ఇప్పుడు టీడీపీని గట్టెక్కించాలంటే కొత్త వ్యూహాలు పన్నాల్సిందే.
ఎందుకంటే ఇప్పటికే చాలామంది పార్టీ నుంచి వీడిపోవటమే కాకుండా ఆయనపై విమర్శలు కూడా చేస్తున్నారు.ఇంకోవైపు యువ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ వేస్తున్న ఎత్తుల్ని చిత్తు చేయాలంటే చంద్రబాబుకు నిత్యం కొత్త సవాల్‌గా మారుతున్నాయి.
దీంతో ఇప్పుడు మరో కొత్త వ్యూహానికి తెరలేపుతున్నారు.దీన్ని బేస్ చేసుకుని ఎలాగైనా రాణించాలని అనుకుంటున్నారు.
ఆ వ్యూహం పేరే పాదయాత్ర.మన తెలుగు రాష్ట్రాల్లో వీటిని ఆధారంగా చేసుకునే అందరూ అధికారంలోకి వస్తున్నారు.

ఇక ఇప్పుడు చంద్రబాబు కూడా దీని ఆధారంగానే జనాల్లోకి వెళ్లి మళ్లీ తన ఇమేజ్‌ను పెంచుకోవాలని చూస్తున్నారు.అయితే దీన్ని సరిగ్గా ఎన్నికలకు ఏడాదిన్నర ముందు చేపట్టి నిత్యం జనాల్లోనే ఉండేలా చూసుకోవాలని భావిస్తున్నారు చంద్రబాబు నాయుడు.ఇప్టపికిప్పుడు తమ పార్టీలోని నేతలను కాపాడుకోవాలన్నా లేదంటే వైసీపీ దూకుడుకు కళ్లం వేయాలన్నా జనంలోకి వెళ్లడమే మంచిదని చంద్రబాబు ఆలోచిస్తున్నారు.అన్నీ కుదిరితే త్వరలోనే ప్రజాయాత్ర పేరుతో పాదయాత్ర ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు చంద్రబాబు.
చూడాలి మరి ఆయన ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో అనేది.ఏదేమైనా చంద్రబాబు దూకుడు పెంచడం మంచిదే అని చెప్పాలి.