బీజేపీలోకి టీడీపీ ఎమ్మెల్యేలు ? గంటా వెంట తీసుకెళ్తున్నారా ?

ఏపీలో మరికొద్ది రోజుల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకునేలా కనిపిస్తున్నాయి.ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో చూసి చూడనట్టుగా వ్యవహరించి బీజేపీ ఇప్పుడు మాత్రం ప్రతి విషయాన్ని రాజకీయం చేసి ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతోంది.

 Ganta Srinivasa Rao Meeting With Bjp Leader Ram Madhav-TeluguStop.com

అదే సమయంలో పార్టీలోకి ఇతర పార్టీల నేతలను చేర్చుకుని బలపడేందుకు ప్రయత్నిస్తోంది.ఇప్పటివరకు ద్వితీయ శ్రేణి నాయకులూ, మాజీ ఎమ్యెల్యే, మాజీ మంత్రులను మాత్రమే చేర్చుకుంటూ హడావుడి చేస్తున్న బీజేపీ ఇప్పుడు మాత్రం ఎమ్యెల్యేలను చేర్చుకుని దడ పుట్టించాలని చూస్తోంది.

ఈ నేపథ్యంలో ముందుగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన శాసన సభ్యులను టార్గెట్ చేసుకుంది.ఇప్పటికే ఆ పార్టీలో ఉండలేక అటు వైసీపీలో చేరలేక ఇబ్బంది పడుతున్న కొంతమంది ఎమ్యెల్యేలను ముందుగా గుర్తించి వారిని బీజేపీలో చేర్చుకునేలా ప్రయత్నాలు చేస్తోంది.

తాజాగా విశాఖపట్నం ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు బీజేపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు.గంటా ఎన్నికల ముందు నుంచి పార్టీ మారేందుకు చాలా ప్రయత్నాలే చేసాడు.

కానీ కుదరలేదు.ఆ తరువాత టీడీపీ అభ్యర్థిగానే పోటీ చేసి గెలుపొందాడు.

ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉండడంతో ఆ పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నిద్దామన్నా రాజీనామా చేసి రావాలన్న షరతు ఉండటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.తాజాగా ఆయన బీజేపీలో చేరేందుకు రెండు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి బీజేపీ అగ్ర నాయకులతో మంతనాలు చేసినట్టు సమాచారం.

ముఖ్యంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తో సమావేశమయ్యారని తెలుస్తోంది.అలాగే రాజ్యసభ సభ్యులు టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి సీఎం రమేష్‌తోనూ భేటీ అయ్యి తన రాజకీయ జీవితం గురించి చర్చించినట్టు సమాచారం.

Telugu Ap, Bjp Ram Madhav, Bjp, Gantasrinivasa, Tdp Mlas, Ysrcp-Telugu Political

బీజేపీలో తానొక్కడు మాత్రమే చేరకుండా సుమారు తొమ్మిది మంది ఎమ్యెల్యేలను సైతం తనతో పాటు బీజేపీలో చేర్చేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేతో గంటా ఇప్పటికే మాట్లాడారట.అలాగే విశాఖ జిల్లాకు చెందిన మరో టీడీపీ ఎమ్మెల్యే, గుంటూరుకు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే అటు గంటాతోనూ ఇటు సుజనాతో నిత్యం మాట్లాడుతున్నట్టు సమాచారం.అదే బాటలో అనంతపురంలో జిల్లాకు చెందిన టీడీపీ కీలక ఎమ్మెల్యే కూడా గంటా వెంట వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఇలా తొమ్మిది మంది వరకు ఎమ్యెల్యేను పార్టీలో చేర్పించి గంటా బీజేపీలో కీలక పదవిని సంపాదించేందుకు స్పష్టమైన హామీ పొందినట్టు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube