రామ్ చరణ్ నుండి విజయ్ దేవరకొండ వరకు ఎంతో మంది నిర్మాతలుగా మారిన విషయం తెల్సిందే.కొందరు హీరోలు నిర్మాతలుగా సక్సెస్ అయితే కొందరు నిర్మాతలుగా నష్టాలను చవి చూశారు.
హీరోలు అనేక రకాలుగా రంగాల్లో రాణించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ కూడా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అందుకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి.
భారీ ఎత్తున భారీ బడ్జెట్‌తో కాకుండా ఒక మీడియం బడ్జెట్‌తో సినిమాలను నిర్మించేందుకు సిద్దం అయ్యాడని తెలుస్తోంది.
తన స్నేహితులతో కలిసి బ్యానర్ ఏర్పాటు చేస్తున్నారు.పెట్టుబడిని స్నేహితులు పెట్టినా ఎన్టీఆర్ సమర్పించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ఎంతో మంది హీరోలు ఇప్పటికే నిర్మాతలుగా రాణిస్తున్న కారణంగా తాను కూడా ఇక అదే రూటులో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం అందుతోంది.
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాన్ని చేస్తున్న ఎన్టీఆర్ ఆ తర్వాత చేయబోతున్న సినిమా విషయమై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.ప్రస్తుతం రాజమౌళి సినిమాపైనే పూర్తి శ్రద్ద పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా చిన్న బడ్జెట్ చిత్రాలను తీసేందుకు స్క్రిప్ట్‌లు రెడీ చేయించాంటూ సన్నిహితులకు ఎన్టీఆర్ సూచించినట్లుగా సమాచారం అందుతోంది.
రామ్ చరణ్ కూడా చిన్న సినిమాలను నిర్మించేందుకు సిద్దం అవుతున్నాడు.ఇదే సమయంలో మహేష్‌బాబు వెబ్ సిరీస్‌లకు కూడా రెడీ అయ్యాడు.కనుక ఎన్టీఆర్ కూడా నిర్మాతగా సక్సెస్ అవుతాడేమో చూడాలి.
.