అసంతృప్తిని కలిగించింది, అయినా తీర్పును గౌరవిస్తున్నాం

హిందూ ముస్లీం వివాదంగా మారిన అయోధ్య భూ వివాదం కేసును సుప్రీం నేటితో తేల్చి పారేసింది.ఆ భూమిలో మసీదు ఏర్పాటు చేసినా కూడా అంతకు ముందు ఒక కట్టడం ఉన్నట్లుగా గుర్తించినట్లుగా సుప్రీం పేర్కొంది.

 Muslim Laywer Respect On Final Announcement Of Ayyodhya Rama Mandhir-TeluguStop.com

అందుకే సరైన పత్రాలు మరియు ఇతరత్ర కారణాల వల్ల హిందువులకు కొంత అనుకూలంగా తీర్పు వచ్చిందనే విషయం తెల్సిందే.అయితే ఈ తీర్పుపై ముస్లీం తరపు లాయర్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

విచారణ సరిగానే జరిగినా తీర్పు విషయంలో కాస్త అసంతృప్తిగా ఉందని ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పాడు.

ముస్లీంలకు అయోధ్యలోనే మరో చోట అయిదు ఎకరాల భూమిని కేటాయించేందుకు సుప్రీం ప్రభుత్వంను ఆదేశించింది.

అయినా కూడా ఆ రెండున్న రెకరాల స్థలం విషయంలో కాస్త గందరగోళం ఉన్న కారణంగా ముస్లీం తరపు లాయర్‌ ఒకింత అసంతృప్తిని వ్యక్తం చేశాడు.అయితే ఈ తీర్పును గౌరవిస్తున్నామని, ప్రతి ఒక్కరు కూడా సుప్రీం తీర్పుకు కట్టుబడి ఉండాలంటూ అందరు కూడా శాంతిగా ఉంటూ దేశ సార్వౌభౌమత్వంను కాపాడాలంటూ కోరడం జరిగింది.

ముస్లీం వక్ఫ్‌ బోర్డు సుదీర్ఘ కాలంగా ఈ కేసులో వాదనలు వినిపించడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube