జగన్ సైలెంట్... బీజేపీ వైలెంట్! ఏపీలో బీజేపీ మత రాజకీయం

ఏపీలో ఎలా అయిన పుంజుకొని ఈ ఐదేళ్ళలో బలమైన పార్టీగా ఏర్పడి, 2024 ఎన్నికలలో వైసీపీకి ప్రధాన ప్రత్యర్ధిగా మారాలని అనుకుంటున్నా బీజేపీ పార్టీ తనకున్న అన్ని అవకాశాలని వినియోగించుకుంటుంది.ముఖ్యంగా రాజకీయాలలో ఉద్దండులు అయిన నేతలని తన పార్టీలోకి లాక్కునే ప్రయత్నం చేస్తుంది.

 Bjp Leaders Targeting Cm Ys Jagan-TeluguStop.com

ఇందులో భాగంగా టీడీపీని టార్గెట్ చేసింది.టీడీపీ నేతలు కూడా ఈ ఐదేళ్ళలో టీడీపీలో ఉండి ఎలాంటి ప్రయోజనం ఉండదు, బీజేపీలోకి వెళ్తే ఎంతో కొంత లాభం ఉంటుంది అని కండువా మార్చేస్తున్నారు.

మరో వైపు వైసీపీకి తాము ప్రధాన ప్రత్యర్ధి అని ప్రజలకి చూపించుకోవడానికి బీజేపీ నేతలు మరో వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.

అందులో భాగంగానే వైసీపీ ప్రభుత్వం ఏర్పడి కనీసం రెండు నెలలు కూడా కాకుండానే వైసీపీ ప్రభుత్వం పరిపాలనలో ఫెయిల్ అయ్యిందని, పథకాలు అమలు చేయలేకపోతుంది అని, అసెంబ్లీలో రౌడీల మాదిరి ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్నారు అంటూ, సభా హక్కులు వైసీపీ నేతలు భంగం కలిగిస్తున్నారు అంటూ ఎవరికీ తోచిన విమర్శలు వారు చేసుకుంటూ పోతున్నారు.

అయితే బీజేపీ నేతలు ఎన్ని విధాలుగా విమర్శలు చేస్తున్న వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ కాని, వైసీపీ ఎమ్మెల్యేలు కాని ఒక్క మాట కూడా బీజేపీ పార్టీ నేతలని అనడం లేదు.వారి విమర్శలకి స్పందిస్తే మనమే వారిని దగ్గరుండి పెద్ద వాళ్ళని చేసినట్లు అవుతుందని జగన్ భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.

అయితే బీజేపీ ఉత్తర భారతదేశంలో మతాన్ని అడ్డు పెట్టుకొని ఎలా అయితే లబ్ది పొందిదో అలాగే ఏపీలో కూడా మత రాజకీయం చేసి హిందుత్వ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి జగన్ ని టార్గెట్ చేయాలని భావిస్తుంది.మరి ఇది ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుంది అనేది వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube