పెళ్లి చేసుకోకుంటే పిల్లలు ఉండకూడదా అంటున్న హీరోయిన్‌

బాలీవుడ్‌ సంచలన హీరోయిన్‌ మహిగిల్‌ ఈమద్య కాలంలో పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు.ఈమె సినిమాల్లో కనిపించకున్నా కూడా ఈమెకు ఉత్తరాదిన మంచి గుర్తింపు ఉంది.

 Bollywood Actress Mahi Gillcomments-TeluguStop.com

ఈమె చేసిన పాత్రలు ఆమెను గుర్తించుకునేలా చేశాయి.నాలుగు పదుల వయసు దాటిన ఈ సీనియర్‌ హీరోయిన్‌ పెళ్లి చేసుకోకుండానే జీవితాన్ని గడిపేస్తుంది.

అయితే పెళ్లి చేసుకోకుండానే తల్లి మాత్రం అయ్యింది.పెళ్లి చేసుకోకుండా తల్లి అవ్వడంను గర్వంగా ఈ అమ్మడు ఫీల్‌ అవుతోంది.

పెళ్లి చేసుకోకుంటే పిల్లలు ఉ

తల్లి అవ్వడం అనేది చాలా గర్వించదగ్గ విషయం.నేను తల్లి అయినందుకు గర్వ పడుతున్నాను.తల్లి అయ్యేందుకు పెళ్లి అవ్వాలనే విషయాన్ని నేను పట్టించుకోను.ఎవరేం అనుకున్నా కూడా నేను వారి గురించి ఆలోచించను.ప్రస్తుతం తన కూతురుతో జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతున్నట్లుగా చెప్పుకొచ్చింది.పెళ్లి చేసుకోకుండా పిల్లలను కనడం తప్పుగా భావించే వారి విమర్శలను తాను అసలు పట్టించుకోనని, నాకు ఇష్టం అయినదే నేను చేస్తానంటూ చెప్పుకొచ్చింది.

పెళ్లి చేసుకోకుంటే పిల్లలు ఉ

పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదా అంటూ ప్రశ్నించిన సమయంలో సమయం వచ్చినప్పుడు.చేసుకోవాలనిపించినప్పుడు తప్పకుండా చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది.పెళ్లి చేసుకోకుండా పిల్లలను కనడంలో నాకు ఎలాంటి సమస్య లేనప్పుడు ఇతరులకు ఎందుకు సమస్య అంటూ ఈఅమ్మడు ప్రశ్నించింది.మొత్తానికి మహిగిల్‌ చాలా బోల్డ్‌గా తన అభిప్రాయంను చెప్పడంతో అందరి దృష్టిని ఆకర్షించింది.

గతంలోనే తనకు పిల్లలున్న విషయాన్ని చెప్పక పోవడంపై స్పందిస్తూ అప్పుడు నన్ను ఎవరు అడగలేదు అంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube