పెళ్లి చేసుకోకుంటే పిల్లలు ఉండకూడదా అంటున్న హీరోయిన్
TeluguStop.com
బాలీవుడ్ సంచలన హీరోయిన్ మహిగిల్ ఈమద్య కాలంలో పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు.
ఈమె సినిమాల్లో కనిపించకున్నా కూడా ఈమెకు ఉత్తరాదిన మంచి గుర్తింపు ఉంది.ఈమె చేసిన పాత్రలు ఆమెను గుర్తించుకునేలా చేశాయి.
నాలుగు పదుల వయసు దాటిన ఈ సీనియర్ హీరోయిన్ పెళ్లి చేసుకోకుండానే జీవితాన్ని గడిపేస్తుంది.
అయితే పెళ్లి చేసుకోకుండానే తల్లి మాత్రం అయ్యింది.పెళ్లి చేసుకోకుండా తల్లి అవ్వడంను గర్వంగా ఈ అమ్మడు ఫీల్ అవుతోంది.
"""/"/
తల్లి అవ్వడం అనేది చాలా గర్వించదగ్గ విషయం.నేను తల్లి అయినందుకు గర్వ పడుతున్నాను.
తల్లి అయ్యేందుకు పెళ్లి అవ్వాలనే విషయాన్ని నేను పట్టించుకోను.ఎవరేం అనుకున్నా కూడా నేను వారి గురించి ఆలోచించను.
ప్రస్తుతం తన కూతురుతో జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతున్నట్లుగా చెప్పుకొచ్చింది.పెళ్లి చేసుకోకుండా పిల్లలను కనడం తప్పుగా భావించే వారి విమర్శలను తాను అసలు పట్టించుకోనని, నాకు ఇష్టం అయినదే నేను చేస్తానంటూ చెప్పుకొచ్చింది.
"""/"/
పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదా అంటూ ప్రశ్నించిన సమయంలో సమయం వచ్చినప్పుడు.
చేసుకోవాలనిపించినప్పుడు తప్పకుండా చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది.పెళ్లి చేసుకోకుండా పిల్లలను కనడంలో నాకు ఎలాంటి సమస్య లేనప్పుడు ఇతరులకు ఎందుకు సమస్య అంటూ ఈఅమ్మడు ప్రశ్నించింది.
మొత్తానికి మహిగిల్ చాలా బోల్డ్‌గా తన అభిప్రాయంను చెప్పడంతో అందరి దృష్టిని ఆకర్షించింది.
గతంలోనే తనకు పిల్లలున్న విషయాన్ని చెప్పక పోవడంపై స్పందిస్తూ అప్పుడు నన్ను ఎవరు అడగలేదు అంది.
నాగచైతన్యకు ఆ స్టార్ హీరో అభిమానుల సపోర్ట్.. తండేల్ బ్లాక్ బస్టర్ కావడం పక్కా!