జర్నలిస్ట్‌కు క్లాస్‌ పీకి తప్పు ఒప్పుకున్న జీవిత

జీవిత రాజశేఖర్‌లపై చాలా కాలంగా ఒక విమర్శ ఉంది.అదేంటి అంటే రాజశేఖర్‌ ఏ సినిమాలో నటించినా కూడా ఆ సినిమా దర్శకత్వంలో జీవిత మరియు రాజశేఖర్‌లు ఇద్దరు కూడా వేలు పెడతారట.

 Jivithainvolve In Kalkimovie-TeluguStop.com

గత పుష్కర కాలంగా వారు ఇదే చేస్తున్నారు.అందుకే సినిమాలు ఫ్లాప్‌ అవుతున్నాయి.

గరుడ వేగ మాత్రం ఏదో అలా సక్సెస్‌ అయ్యిందని అంటూ ఉన్నారు.అయితే తాజాగా ‘కల్కి’ చిత్రం విషయంలో కూడా అలాంటి ఆరోపణలు మరియు పుకార్లు వచ్చాయి.

జర్నలిస్ట్‌కు క్లాస్‌ పీకి త

తాజాగా ‘కల్కి’ చిత్రం విడుదలైంది.ఆ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా నిర్మాత అయిన జీవిత మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.ఆ మీడియా సమావేశంలో జీవితను ఒక జర్నలిస్ట్‌ ‘మీరు డైరెక్షన్‌లో జోక్యం చేసుకుంటారు’ అంటూ బయట ప్రచారం ఉంది.దానికి మీ సమాధానం ఏంటీ అంటూ ప్రశ్నించాడు.

జర్నలిస్ట్‌ ప్రశ్నకు జీవిత సీరియస్‌ అయ్యింది.ఇలాంటి ప్రశ్నలు మీరు అడగవద్దు.

ఒక ప్రశ్న అడిగే సమయంలో కాస్త ఆలోచించాలంటూ జర్నలిస్ట్‌లకు క్లాస్‌ పీకింది.

జర్నలిస్ట్‌కు క్లాస్‌ పీకి త

జీవిత ఆ ప్రశ్నకు స్పందిస్తూ నేను దాదాపుగా 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను.దర్శకురాలిగా కూడా నాకు అనుభవం ఉంది.‘కల్కి’ సినిమాను నిర్మించింది నేనే.20 కోట్ల పెట్టుబడి పెట్టినప్పుడు ఆ సినిమా ఎలా వచ్చింది అనేది చూసుకోవాల్సిన బాధ్యత నాకు లేదా.సినిమా నాకు నచ్చకున్నా కూడా దర్శకుడు చెప్పిన విధంగా, తీసిన విధంగానే నేను ఓకే చెప్పాలా.

నాకు దర్శకత్వంలో అనుభవం ఉంది.సినిమా మేకింగ్‌పై అవగాహణ ఉంది.

కనుక నేను కల్కి చిత్రం డైరెక్షన్‌లో వేలు పెట్టాను అంటూ చెప్పకనే చెప్పింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube