కూతురు సినిమాపై ఫుల్‌ క్లారిటీ ఇచ్చి పుకార్లకు చెక్‌ పెట్టిన రాజశేఖర్‌

జీవిత రాజశేఖర్‌లు తమ పెద్ద కూతురును హీరోయిన్‌గా పరిచయం చేయబోతున్నట్లుగా గత మూడు సంవత్సరాలుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఎట్టకేలకు గత ఏడాది పెద్దమ్మాయి శివానీ హీరోయిన్‌గా ‘2 స్టేట్స్‌’ మూవీ రీమేక్‌ ప్రారంభం అయ్యింది.

 Jeevitha Rajasekhar About His Two Daughters Movies-TeluguStop.com

అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఇప్పటికే శివానీ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.కాని షూటింగ్‌ సగం వరకు పూర్తి అయిన తర్వాత సినిమా క్యాన్సిల్‌ అయ్యిందని వార్తలు వస్తున్నాయి.

సినిమా ఔట్‌ పుట్‌ సరిగా లేకపోవడంతో మద్యలోనే నిలిపేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.

కూతురు సినిమాపై ఫుల్‌ క్లారి

తాజాగా ‘కల్కి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజశేఖర్‌ ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా శివానీ సినిమాపై క్లారిటీ ఇచ్చాడు.నా కూతురు సినిమా ఆగిపోయిందని, సినిమా ఔట్‌ పుట్‌పై సంతృప్తి కలగక పోవడంతో తాము సినిమాను క్యాన్సిల్‌ చేసినట్లుగా రాజశేఖర్‌ చెప్పుకొచ్చాడు.దీంతో గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న పుకార్లకు చెక్‌ పెట్టినట్లయ్యింది.

త్వరలోనే కొత్త సినిమాతో శివానీ వస్తుందని చెప్పుకొచ్చాడు.ఇదే సమయంలో చిన్నమ్మాయి శివాత్మిక ‘దొరసాని’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఆనందం వ్యక్తం చేశాడు.

పెద్దమ్మాయి సినిమా విడుదల కాకుండానే చిన్నమ్మాయి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.మొదట పెద్దమ్మాయిని అనుకుంటే ఈలోపే చిన్నమ్మాయి వచ్చేస్తోంది.ఆనంద్‌ దేవరకొండతో కలిసి చిన్నమ్మాయి శివాత్మిక దొరసానిగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.భారీ అంచనాలున్న దొరసాని చిత్రంతో శివాత్మిక సక్సెస్‌ దక్కించుకుంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube