శ్రీహరి తనయుడు మేఘాంశ్ హీరోగా ‘రాజ్‌దూత్’ అనే చిత్రం తెరకెక్కింది.వచ్చే వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాజ్‌దూత్ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా మేఘాంశ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీబిజీగా గడుపుతున్నాడు.
ఇక కొన్ని రోజులుగా మీడియాలో మేఘాంశ్‌కు ఎన్టీఆర్ చాలా సాయం చేశాడని, శ్రీహరి చనిపోయి తర్వాత ఎన్టీఆర్ ఆ కుటుంబంకు అండగా నిలబడ్డాడట అంటూ వార్తలు వస్తున్నాయి.మీడియాలో వస్తున్న వార్తలపై మేఘాంశ్ మండి పడ్డాడు.
‘రాజ్‌దూత్’ చిత్రం ఆడియో విడుదల వేడుక సందర్బంగా నేను ఎన్టీఆర్ నాకు సాయం చేశాడు, ఆయన సాయం వల్లే తాను ఇప్పుడు హీరోగా మీ ముందుకు రాబోతున్నాను అంటూ మాట్లాడినట్లుగా కొందరు వార్త కథనాలు రాస్తున్నారు.అసలు ఆ రోజు నేను మాట్లాడిన మాటలు మరోసారి మీరంతా కూడా చూడాలి.
అందులో ఎక్కడైనా నేను ఎన్టీఆర్ పేరు కూడా ప్రస్తావించలేదు.అయినా కూడా నేను అలా అన్నానంటూ ఎలా ప్రచారం చేస్తున్నారో నాకు అర్థం అవ్వడం లేదంటూ మేఘాంశ్ ఆసహనం వ్యక్తం చేశాడు.

మేఘాంశ్ తాజాగా ఇచ్చిన క్లారిటీతో గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలకు ఫుల్‌స్టాప్ పడ్డట్లయ్యింది.శ్రీహరి చిన్న కొడుకు అయిన మేఘాంశ్ హీరోగా పరిచయం కాబోతున్న ‘రాజ్ దూత్’ మూవీ కథ పూర్తిగా ఒక బండి చుట్టు తిరుగుతు ఉంటుందట.బండి నేపథ్యంలో కథ సాగుతుందని, రియల్ సంఘటనలను ఆధారంగా తీసుకుని ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించాడంటూ మేఘాంశ్ చెప్పుకొచ్చాడు.రాజస్థాన్‌లోని ఒక ప్రాంతంలో బండికి గుడి కట్టారట.
దాన్ని ఇతివృత్తంగా తీసుకున్నామని శ్రీహరి తనయుడు చెప్పాడు.